EMI Break without CIBIL effect : ఈఎంఐ కట్టలేకపోతే ఇలా బ్రేక్ తీసుకోండి? CIBILపై ఎఫెక్ట్ పడకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్
Moratorium : వివిధ సందర్భాల్లో లోన్ కట్టడం కాస్త కష్టమవుతుంది. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా CIBIL స్కోర్ దెబ్బతినకుండా ఎలా బ్రేక్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Loan Moratorium Tips : నచ్చిన వస్తువులను లేదా సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు, ఇతర అవసరాల కోసం చాలామంది లోన్ తీసుకుంటారు. దానిని ఈఎంఐ రూపంలో చెల్లిస్తారు. కావాల్సిన, నచ్చిన వస్తువులను కొనుక్కునేందుకు, ఒకేసారి డబ్బు చెల్లించే పరిస్థితి లేనప్పుడు ఇలా లోన్ రూపంలో డబ్బులు తీసుకోవడం లేదా డౌన్ పేమెంట్ కట్టి EMI ఆప్షన్ ఎంచుకుంటారు.
తక్కువ మొత్తంలో EMI కట్టాల్సిన వచ్చినా.. కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బులు ఉండవు. దానివల్ల కట్టాల్సిన EMI పెండింగ్ పడిపోతుంది. కాస్త ఎక్కువరోజులు అయితే ఇంటికి ఏజెంట్లు వచ్చి మరీ ఇబ్బంది పెడతారు. ఆ సమయంలో మీరు ఓ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. మీకు జాబ్ లేదా బిజినెస్‌లో ఎలాంటి ఇబ్బంది అయినా వచ్చి.. ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడుతుంటే మీరు Moratorium ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
మోరటోరియం (Moratorium)
మీరు ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకుని ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారో.. వారి దగ్గరకు వెళ్లి మీ పరిస్థితిని చెప్పి మోరటోరియం కావాలని అడగాలి. అంటే మీరు ఈఎంఐని తాత్కాలికంగా నిలిపివేయడం. కొంత సమయం వరకు వాయిదాలు చెల్లించకుండా గ్యాప్ తీసుకునే ప్రాసెస్‌ను Moratorium అంటారు. దీని గురించిన పూర్తి వివరాలు.. CIBILపై ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
గ్యాప్ తీసుకోవచ్చు..
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మీరు ఈఎంఐను వాయిదా వేసుకునేందుకు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా లోన్ తీసుకున్న వారు తాత్కాలికంగా కొన్ని రోజులు రిలీఫ్ పొందవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు ఎక్కడి నుంచి అయితే లోన్ తీసుకున్నారో.. వారు ఈఎంఐ కట్టాలని మిమ్మల్ని ఎలాంటి ఫోర్స్ చేసే అవకాశం ఉండదు. అలా మిమ్మల్ని ఇబ్బంది పెడితే RBI అఫీషయల్ పేజ్‌లో కంప్లైంట్ కూడా ఇవ్వొచ్చు.
సైడ్ ఎఫెక్ట్..
మోరటోరియం సమయంలో రుణగ్రహీత ఎలాంటి అసలు లేదా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎన్ని రోజులు ఈ గ్యాప్ తీసుకుంటారో అన్ని రోజులు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగిన వడ్డీ మీ లోన్‌కి యాడ్ అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. లేదా టైమ్ పీరియడ్ పెరుగుతుంది.
మోరటోరియం ముగిశాక
హౌజ్ లోన్స్, స్టడీ లోన్, పర్సనల్ లోన్స్ వంటి వాటిపై మారిటోరియంలు ఉంటాయి. ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొనేప్పుడు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. అలాగే మోరటోరియం పీరియడ్ ముగిస్తే మళ్లీ ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ లోన్ లేదా దాని వడ్డీని మాఫీ చేయలేదని గుర్తించుకోవాలి. ఇంకా వడ్డీ పెరుగుతుందనే దానిపై కూడా అవగాహన ఉండాలి.
CIBILపై ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే..
ఇలా మోరటోరియం తీసుకున్నప్పుడు CIBILపై ఎఫెక్ట్ పడకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే CIBIL స్కోర్ దెబ్బతింటుంది. మీ బ్యాంక్ అధికారిక మారటోరియం విధానాన్ని మీరు పాటిస్తే.. CIBIL స్కోర్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మీ ఈఎంఐ deferred లేదా under moratorium అని పెడితే CIBILపై ఎఫెక్ట్ ఉండదు. missed లేదా defaulted అని పెడితే కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. మీరు బ్యాంక్‌కి తెలియజేయకుండా ఈఎంఐ కట్టడం ఆపేసినా కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఫ్యూచర్లో మీరు లోన్స్ తీసుకోలేరు.






















