Group Accident Insurance : పోస్టాఫీసులో నెలకి 62 కడితే..15 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందొచ్చు, పూర్తి వివరాలివే
India Post Payments Bank insurance : ప్రతి నెల 62 రూపాయిలు చెల్లిస్తే గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద 15 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని తెలుసా? దాని పూర్తి డిటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

IPPB Group Accident Insurance Scheme : మనము ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బంది పడకూడదని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండొద్దని అనుకుంటారు. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నవారు ఇదే ఆలోచనలో ఉంటారు. అలా కుటుంబం గురించి ఆలోచించే వారే హెల్త్, యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ తీసుకుంటారు. వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని.. తమకు ఏ పాలసీ బెస్టో ఆలోచించి.. తమ బడ్జెట్‌కు తగ్గట్లు తీసుకుంటారు. అలాంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకొనే యాక్సిడెంటల్ పాలసీ కూడా ఒకటి.
తక్కువ డబ్బుతో యాక్సిడెంటల్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఈ పాలసీ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదే GAG Policy. అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ గార్డ్. ఈ పాలసీ ప్రతి ఒక్క ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిని తీసుకుంటే నెలకు 62 రూపాయలు కట్టి.. 15 లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మరి ఈ పాలసీ కోసం ఎలా అప్లై చేయాలి? అర్హతలు ఏంటి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
GAG పాలసీకి అప్లై చేయాలనుకుంటే..
GAG పాలసీకి అప్లై చేయాలనుకుంటే ముందుగా పోస్ట్ ఆఫీస్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్‌లో ఈ అకౌంట్ కావాలి అంటే చాలా ఈజీగా ఇచ్చేస్తారు. IPPB అకౌంట్ ఓపెన్ చేయడానికి 300 ఖర్చు అవుతుంది. ఎందుకంటే మీ అకౌంట్లో 125, అకౌంట్ ప్రీమియం కోసం 175 వేస్తారు కాబట్టి.
పాలసీ ప్రాసెస్..
అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు దానిలో 755 Group Accident Insurence Policy తీసుకోవాలి. ప్రతి నెల 62 రూపాయలు అలా సంవత్సరానికి 755 కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల 15 లక్షల యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ కవర్ అవుతుంది. Annual Premium 15 లక్షలు కాగా.. Sum Insured 15 లక్షలు అందుతుంది. ప్రమాదంలో చనిపోయినా.. శాశ్వతంగా మంచానికి పరిమితమైనా 100 శాతం ఇన్సూరెన్స్ అందుతుంది. పిల్లల పెళ్లికి 1 లక్ష, చదువునకు 5000 వేలు కూడా అందుతాయి.
పాలసీ తీసుకున్నవారు ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి రెండు రోజుల్లో 15 లక్షలు క్లైమ్ అవుతాయి. మెడికల్ బిల్ కింద లక్ష కూడా వస్తుంది. ఈ పాలసీని ప్రతి సంవత్సరానికి ఓసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 65 సంవత్సరాలు ఉండే ప్రతి ఒక్కరు దీనికి అర్హులే. మరి ఈ పాలసీని తీసుకోవాలనుకుంటే మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. సూసైడ్, Illeagal Act, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, రోగాలు, ఎయిడ్స్ వంటివి ఉన్నవారికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు.






















