News
News
X

Hypothyroidism: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే

థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు సరిగా విడుదల చేయకపోతే హైపోథైరాయిడ్ సమస్య వస్తుంది.

FOLLOW US: 
Share:

హిళలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. మెడ దగ్గర కాలర్ బోన్ వద్ద సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. రోజువారీ జీవనానికి కావాల్సిన హార్మోన్లని విడుదల చేయడంలో థైరాయిడ్ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి సరిగా హార్మోన్లు విడుదల చేయకపోతే హైపోథైరాయిడిజం వస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు అలసట, జుట్టు రాలడం, బరువు పెరగడం, మలబద్ధకం, మానసిక సంఘర్షణ వంటి అనేక లక్షణాలకి లోనవుతారు. ప్రాసెస్ చేసిన చక్కెరలు, శుద్ధి చేసిన నూనెలు, పోషకాలు అధికంగా ఉండే మాంసాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే హైపోథైరాయిడిజంతో బాధపడే వాళ్ళు మరి కొన్నింటికి దూరంగా ఉండాలి.

విటమిన్ B తీసుకోవాలి

హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులు విటమిన్ B పుష్కలంగా ఉండే ఆహరం తీసుకోవాలి. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తూ, థైరాయిడ్ పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. మాంసంలో ముఖ్యంగా కాలేయం తీసుకుంటే మంచిది.

శుద్ధి చేసిన చక్కెరలు వద్దు

శుద్ధి చేసిన చక్కెరలు రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ ను పెంచుతాయి. ఇది శరీరం హైపోథాలమిక్ పిట్యూటరీ యాక్సిస్‌పై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో థైరాయిడ్ హార్మోన్లు కూడా ఉంటాయి. దీర్ఘకాలం పాటు తీసుకుంటే థైరాయిడ్ పని చేయకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాదు కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ పని చేయడం ఆగిపోయే సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.

జంతువుల అవయవాల మాంసం మంచిది

అవయవ మాంసంలో సాధారణ మాంసం కంటే 100 రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాలేయం థైరాయిడ్ కు సూపర్ ఫుడ్ అనే న్యూట్రీషియన్స్ చెప్తున్నారు. విటమిన్ ఎ థైరాయిడ్ పనితీరుకి సహకరిస్తుంది. కాలేయ మాంసంలో రాగి, ఐరన్, జింక్, క్రోమియం వంటి ఖనిజాలు, విటమిన్ బి 12, ఫోలేట్ వంటి విటమిన్లు ఉన్నాయి.

గోయిట్రోజెన్‌లు తగ్గించాలి

ఇది కొన్ని మొక్కల ఆధారిత ఆహారాల్లో కనిపించే పదార్థం. దీన్ని అధికంగా తీసుకున్నప్పుడు థైరాయిడ్ పనితీరుకి ఆటంకం కలుగుతుంది. క్యాబేజీ, క్యాలీప్లవర్, బ్రకోలి, బచ్చలికూర, వేరుశెనగ వంటి వాటిలో ఇది ఉంటుంది.

అయోడిన్ వినియోగం పెంచాలి

అయోడిన్ లోపం వల్ల ప్రపంచ జనాభాలో 1/3 వంతు మంది బాధపడుతున్నారు. మానవ శరీరంలో థైరాయిడ్ పనితీరుని ప్రోత్సహించడంలో సహాయపడే అవసరమైన ఖనిజం అయోడిన్. హాపోథైరాయిడిజం సమస్య ఉన్నట్లయితే ఆహారంలో తప్పనిసరిగా అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. సాల్మన్, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

సెలీనియం అధికంగా ఉండే ఆహారం తినాలి

సెలీనియం రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. నట్స్, సార్డినెస్, గుడ్లు, వివిధ రకాల చిక్కుళ్ళు వంటి వాటిలో సెలీనియం అధికంగా లభిస్తుంది.

యాంటీ-న్యూట్రియంట్‌లను నివారించాలి

యాంటీ న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉండే ప్లాంట్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాంట్ ఫుడ్స్‌లో లెక్టిన్‌, ఆక్సలేట్‌, ఫైటేట్‌ మొదలైన యాంటీ న్యూట్రీషియన్‌లు చాలా ఉన్నాయి. హైపోథైరాయిడిజం సమస్య ఉన్న వాళ్ళు వీటిని తీసుకోకపోవడం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: సర్వికల్ క్యాన్సర్ టీకాలు బాలికలకి వేయొచ్చా? HPV వ్యాక్సిన్ అంటే ఏంటి?

Published at : 24 Dec 2022 12:14 PM (IST) Tags: Thyroid Hypothyroidism Healthy Food Hypothyroidism Remedies Health Lifestyle

సంబంధిత కథనాలు

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి