News
News
X

Cervical Cancer: సర్వికల్ క్యాన్సర్ టీకాలు బాలికలకి వేయొచ్చా? HPV వ్యాక్సిన్ అంటే ఏంటి?

గర్భాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం టీకాని వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

FOLLOW US: 
Share:

హిళలు ఎక్కువగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు.. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు. ఈ క్యాన్సర్ ని నయం చేసేందుకు సీరం సంస్థ తొలిసారిగా టీకాని తీసుకురాబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ టీకాని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన Cervavac టీకాను 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకి అందించనున్నారు. అయితే గర్భాశయ క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేని వయస్సు వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి?

లైంగికంగా సంక్రమించే వైరస్ హ్యూమన్ పాపిల్లోమావైరస్(HPV) సోకినప్పుడు గర్భాశయ క్యాన్సర్ రావచ్చు. ఇది గర్భాశయంలోని అత్యంత దిగువ భాగంలో ఉన్న గర్భాశయ కణాలలో అభివృద్ధి చెందుతుంది. క్రమరహిత రక్తస్రావం సాధారణంగా కనిపించే లక్షణం. ఇది పీరియడ్స్ మధ్యలో లేదా లైంగికంగా పాల్గొన్న తర్వాత బ్లీడింగ్ కనిపిస్తుంది. దుర్వాసనతో కూడిన రక్తం వస్తుంది. 

బాలికలకి టీకాలు వేయొచ్చా?

గర్భాశయ క్యాన్సర్ ముందుగానే గుర్తించి సక్రమంగా చికిత్స తీసుకుంటే నయం చేయగలరు. అయితే ఈ టీకాలు HPV ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మాత్రమే సహాయపడుతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడితే మాత్రం చికిత్స చెయ్యలేరు. అందుకే స్త్రీ లైంగికంగా చురుకుగా ఉండటానికి ముందు గర్భాశయ క్యాన్సర్ టీకాలు వేయాలి.

HPV వ్యాక్సిన్ అంటే?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 9-14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలికలు లైంగిక జీవితం మొదలు పెట్టడానికి ముందే ఈ టీకా ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ ని నివారించడం సులభం అవుతుంది. 99 శాతం ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. మొటిమలు, జననేంద్రియ ఇన్ఫెక్షన్స్, ఓరోఫారింజియల్ క్యాన్సర్ల నుంచి కూడా రక్షించగలదు. ఈ టీకా 9-14 ఏళ్ల వారికి మూడు డోసులు ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న ఒకటి లేదా రెండు నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. 6 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవాలి.

భారతదేశంలోని మహిళలు ఎదుర్కొనే వాటిలో గర్భాశయ క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ది లాన్సెట్‌లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న మరణాల్లో భారత్ నుంచి ఎక్కువగానే నమోదవుతున్నాయి. గణాంకాల ప్రకారం భారత్ లో ఏటా 1,20,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నాయి. ప్రతి సంవత్సరం 67 వేల మంది మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

క్యాన్సర్ కి కారణమయ్యే HPV వైరస్‌ నుంచి ఏ వ్యాక్సిన్ పూర్తి స్థాయి రక్షణ అందించదు అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి టీకా తర్వాత కూడా సాధారణ PAP పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. ఇక లైంగికంగా చురుకుగా ఉండే మహిళలు ప్రతి మూడేళ్ళకి ఒకసారి ఈ PAP పరీక్ష చేయించుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: మిగిలిపోయిన ఆహారం తింటే సోమరిపోతులు అయిపోతారంట!

Published at : 24 Dec 2022 11:11 AM (IST) Tags: Cervical Cancer Cervical Cancer Vaccine HPV Vaccine HPV Vaccine campaign HPV Vaccine Benefits

సంబంధిత కథనాలు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే

Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే

గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం

గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!