News
News
X

సీతాఫలం, రామాఫలం తెలుసు -మరి మీకు హనుమాన్ ఫలం తెలుసా?

సీతాఫలం, రామా ఫలం అంటే ఎంతో మందికి ఇష్టం. వాటి కోవకే చెందుతుంది హనుమాన్ ఫలం.

FOLLOW US: 
Share:

చాలా తక్కువ మందికి తెలిసిన పండ్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి లక్ష్మణ ఫలం, దీన్నే కొంతమంది హనుమాన్ ఫలం అని కూడా పిలుస్తారు. ఆంగ్లంలో దీన్ని సోర్సూప్ లేదా గ్రావియోల అంటారు. ఉష్ణ మండల ప్రాంతంలోనే ఈ చెట్లు పెరుగుతాయి. మెక్సికో, దక్షిణ అమెరికాలో అధికంగా ఈ చెట్లు కనిపిస్తాయి. ఇవి రామాఫలం, సీతాఫలం జాతికి చెందినవే. చూస్తే వాటిని గుర్తుతెచ్చేలాగా ఉంటాయి. ఈ పండు తింటుంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్ పండ్లను కలిపి తింటున్నట్టు అనిపించడం ఖాయం. అలా అని రుచి వెరైటీగా ఉంటుందని కాదు, రుచి బాగుంటుంది. శరీరానికి కూడా ఈ పండులోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. కేవలం పండే కాదు ఈ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు, కాయలు, విత్తనాలు కూడా వ్యాధుల చికిత్సలో సంప్రదాయ కషాయాలు తయారు చేయడానికి వినియోగిస్తారు.

ఈ పండు బ్రెజిల్ కి చెందినదిగా చెబుతారు. అక్కడే మొదటగా ఈ చెట్టును కనిపెట్టారని అంటారు. అయితే దక్షిణ భారతదేశంలో కొన్నిచోట్ల ఈ రామాఫలం చెట్లు కనిపిస్తున్నాయి. ఈ పండు చూడటానికి సీతాఫలం, రామా ఫలం పండ్ల కనిపిస్తున్నప్పటికీ దీని తొక్కపై ముళ్ళు ఉంటాయి.

దీని పోషకాలు ఎన్నో
అధ్యయనాల ప్రకారం హనుమాన్ పండ్లలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాల్, ట్రై గ్లిజరైడ్స్, ఫినోలెక్స్, సైక్లోపెటైట్స్ వంటి ముఖ్యమైన ఫైటో కెమికల్స్ 212 దాకా ఉంటాయి. 100 గ్రాముల పండును తింటే అందులో 81 గ్రాములు నీరే ఉంటుంది. ప్రోటీన్, డైటరీ ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఫొలేట్ వంటి ఎన్నో పోషకాలు ఈ పండులో నిండి ఉన్నాయి. ఈ పండును యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థరైటిస్, యాంటీ మైక్రోబయల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

కీమోథెరపీ పండు
ఈ పండును సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన కీమోథెరపీ అని కూడా చాలా చోట్ల పిలుస్తారు. ఈ పండును, ఈ చెట్టు ఆకులను తీసుకోవడం వల్ల 12 రకాల క్యాన్సర్లను తరిమి కొట్టవచ్చని ఎంతోమంది నమ్మకం. ఇందులో ఉండే ఎసిటోజెనిన్స్, క్వినోలోన్స్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేస్తాయని చెబుతారు. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి రోగాల నుండి ఈ పండు రక్షిస్తుంది.

యుటిఐ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువమంది మహిళలు ఎదుర్కొంటున్న ఆదారణ ఆరోగ్య సమస్యలలో ఇది ఒకటి ఈ సమస్యతో బాధపడుతున్న వారు హనుమాన్ ఫలం తినడం వల్ల ఉపయోగం ఉంటుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి మూత్రంలో ఆమ్లస్థాయిని ఆరోగ్యకరంగా నిర్వహిస్తుంది పెరిగినప్పుడే యుటిఐ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి

జీర్ణ క్రియకు 
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ రుగ్మతలు రాకుండా ఉంటాయి. ఈ పండులో కరిగే లేదా కరగని ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ పండును తరచూ తినాలి.

నీరు చేరకుండా 
చాలామంది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో శరీరంలో నీరు నిలిచిపోయి ఉబ్బినట్లు కనిపిస్తారు. హనుమాన్ ఫలం తినడం వల్ల ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో నీరు నిలుపుదలను నివారిస్తుంది. ఈ పండు తినడం వల్ల కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. 

Also read: త్వరగా బరువు తగ్గాలనుకుంటే క్వినోవా ఉప్మా తినండి, రెసిపీ ఇదిగో

Published at : 12 Feb 2023 07:47 AM (IST) Tags: Hanuman Phalam What is Hanuman Phalam SeethaPhalam and Hanuman Phalam

సంబంధిత కథనాలు

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Summer Skin Care: అబ్బాయిలూ ఈ వేసవిలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి

Summer Skin Care: అబ్బాయిలూ ఈ వేసవిలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!