Nose Hair: ముక్కులో వెంటుకలను పీకేస్తే అంత ప్రమాదమా? మెదడువాపు వ్యాధి వస్తుందా?
ముక్కులో వెంటుకలను ఇష్టానుసారంగా పీకేస్తున్నారా? జాగ్రత్త అలా చేయడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే షాకవుతారు.
ముక్కులో వెంటుకలు అందాన్ని తగ్గిస్తాయని, ఎదుటివాళ్లు తమని చికాకుగా చూస్తారని చాలామంది భవిస్తారు. అందుకే, వాటిని లోతుగా కట్ చేయడం, లేదా పూర్తిగా పీకేయడం చేస్తుంటారు. ఇటీవల ముక్కులోని వెంటుకలను పూర్తిగా తొలగించే ట్రిమ్మర్లు, నోస్ వాక్సింగ్ అప్లికెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. నోస్ వాక్సింగ్‌లో భాగంగా ఒక మైనపు అప్లికేటర్‌ను నాసికా రంధ్రంలోకి పంపిస్తారు. గట్టిపడిన తర్వాత దాన్ని గట్టిగా లాగుతారు. దానివల్ల ముక్కులోని వెంటుకలు మొదళ్ల నుంచి ఊడి వచ్చేస్తాయి.
ముక్కును శుభ్రంగా, క్లీన్‌గా ఉంచుకోవడంలో తప్పులేదు. కానీ, పూర్తిగా వాటిని పీకడానికి బదులు కొద్దిగా కత్తిరించుకోవడమే ఉత్తమం అని వైద్య నిపుణులు అంటున్నారు. ముక్కులోని వెంటుకలు చూసేందుకు చిరాగ్గా కనిపించినా.. అవి మనకు మేలే చేస్తాయి. దుమ్మూ, దూళి, సూక్ష్మ జీవులు నేరుగా ఊపిరితీత్తుల్లోకి చేరకుండా అడ్డుకుంటాయి. స్నానం చేసినప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడం ద్వారా వాటికి అంటుకున్న మలినాలను తొలగించవచ్చు.
మహిళలతో పోల్చితే పురుషుల ముక్కులోనే ఎక్కువగా వెంటుకలు మొలుస్తాయి. అయితే, స్త్రీ-పురుషుల్లో ఎవరైనా సరే ఆ వెంటుకలను మొదళ్లతో సహా పెకిలించడం మంచిది కాదని డాక్టర్ కరణ్ రాజ్ అనే వైద్యుడు హెచ్చరించారు. అలా చేయడం వల్ల మెదడుకు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని తెలిపాడు.
కరణ్ రాజ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘మీకు రెండు రకాల ముక్కు వెంటుకలు ఉంటాయి. మైక్రోస్కోపిక్ సిలియా అనే వెంటుకలు శ్లేష్మాన్ని ఫిల్టర్ చేసి.. గొంతు వెనుకకు పంపుతాయి. అవి అక్కడి నుంచి కడుపులోకి వెళ్తాయి. వైబ్రిస్సే అనే వెంటుకలు.. బయటకు చొచ్చుకొచ్చే ఈ వెంటుకలనే మీరు పీకేయాలని అనుకుంటారు. కానీ, అవి పెద్ద కణాలను ముక్కు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. వాటిని మీరు లాగేస్తే సూక్ష్మక్రిములు ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి’’ అని తెలిపారు.
ముక్కు భాగంగాలోని నోటికి సమీపం నుంచి ముక్కు చివర వరకు ఉండే భాగాన్ని Danger Triangle అంటారని కరణ్ రాజ్ తెలిపారు. ఎందుకంటే.. ఈ భాగం మెదడుకు కనెక్ట్ అవ్వి ఉంటుంది. ఈ ప్రాంతంలో చిన్న ఇన్ఫెక్షన్ ఏర్పడినా.. మెదడుకు చేరుతుంది. ఈ ప్రాంతంలో ముక్కు నుంచి రక్తాన్ని బయటకు తీసుకెళ్లే సిరలు.. మెదడు నుంచి రక్తాన్ని తీసుకెళ్లే సిరలతో కలుస్తాయి. దీంతో ముక్కులో ఉండే సూక్ష్మజీవులు మెదడులోకి చేరినట్లయితే మెదడు వాపు వ్యాధి ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల మెదడులో గడ్డలు ఏర్పడతాయి.
Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే వ్యక్తులకే ఈ ప్రమాదం ఎక్కువని డాక్టర్ తెలిపారు. కాబట్టి, ఈ సారి నుంచి ముక్కులోని వెంటుకలను పూర్తిగా పీకేయకుండా.. వాటిని కత్తిరించేందుకే ప్రయత్నించండి. అలాగే కత్తెర వల్ల నాసికా రంథ్రాల గోడలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ముక్కులో వెంటుకలను కట్ చేసేందుకు ట్రిమ్మర్లు అందుబాటులోకి వచ్చాయి. వీలైతే వాటిని ముక్కు వెంటుకలను కట్ చేయడానికి ఉపయోగించండి.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!