అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Poppy Seeds: బరువు పెరగాలని అనుకుంటున్నారా? అయితే వీటిని కలుపుకుని పాలు తాగేయండి

బరువు తగ్గడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయితే బరువు పెరగడం మాత్రం అంత తేలికైన పని కాదు. ఈ హోమ్ రెమిడితో అది సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది బరువు పెరిగిపోయి భారంగా మారిన శరీరాన్ని ఎలా తగ్గించుకోవాలా అని తిప్పలు పడతారు. మరి కొందరు సన్నగా ఉన్నామని బాధపడతారు. బరువు తగ్గడానికి డైట్ ఉన్నట్టే బరువు పెరిగేందుకు సప్లిమెంట్లు, ప్రోటీన్లు ఉన్నాయి. అయితే వీటి వల్ల కొంతవరకు ప్రయోజనం ఉన్నప్పటికీ దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అలా కాకుండా నేచురల్ పద్ధతిలో బరువు పెరగాలని చూసే వారికి ఇది అద్భుతమైన మార్గం. అదే ఖుస్ ఖుస్.. ఇదేదో విచిత్రమైన పదార్థం అనుకునేరు. అందరి వంట గదిలో లభించే గసగసాలు బరువుని పెంచుకునేందుకు సహాయపడతాయి.

గసగసాలు ఎందుకు?

వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం 100 గ్రాములలో దాదాపు 525 కేలరీలు లభిస్తాయి. బరువు పెరగాలని అనుకునే వారికి నిపుణులు సూచించే అద్భుతమైన హోమ్ రెమిడీ ఇది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల గసగసాలలో 28.13 గ్రాముల పిండి పదార్థాలు ఉన్నాయి. ఇందులోని జింక్ థైరాయిడ్ గ్రంధుల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్లకు మంచి మూలం. కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. రోజూ పాలతో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

గసగసాల ప్రయోజనాలు

⦿ మలబద్ధకం, గ్యాస్ సమస్యల్ని తొలగిస్తుంది

⦿ మహిళల్లో సంతానోత్పత్తి అవకాశాలు పెంచుతుంది

⦿ కడుపు సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది

⦿ ఇందులోని ఫైబర్ పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది

⦿ రోజూ గసగసాలు తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది

గసగసాల సైడ్ ఎఫెక్ట్స్

పోషకాలు నిండి ఉన్నప్పటికీ అతిగా తీసుకోవడం వల్ల అనార్థాలు ఉన్నాయి. వీటిని అధికంగా తీసుకుంటే..

⦿ అలర్జీ

⦿ మలబద్ధకం

⦿ వికారం

⦿ అలసట వంటి ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది

ఎలా తింటే బరువు పెరుగుతారు?

గసగసాల గింజలు కొన్ని నీటిలో కనీసం 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని రాత్రి పాలలో వేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకసారి కాచి పక్కన పెట్టుకున్న తర్వాత పడుకునే ముందు వీటిని తాగితే మంచిది. ఈ పాలు తాగిన మూడు నుంచి నాలుగు వారాల లోపే బరువు పెరగడంలో మార్పులు చూడవచ్చు. ఒకవేళ పేస్ట్ గా చేసుకోకపోవడం ఇష్టం లేకపోతే గసగసాలు పొడి చేసి పెట్టుకోవచ్చు. వాటిని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేసుకోవచ్చు. కాస్త ఘాటు రుచి కలిగి ఉంటుంది. పాల రుచి మరింత పెంచుకునేందుకు దీనికి కొద్దిగా సోంపు పొడి కూడా జోడించుకోవచ్చు. దాన్ని మిక్స్ చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా నయం అవుతాయి. కడుపు సమస్యల్ని తగ్గించి మంచి నిద్రని ప్రోత్సహిస్తాయి. రాత్రి ప్రశాంతమైన నిద్రని అందిస్తాయి.   

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: వాడేసిన టీఆకులు పారేస్తున్నారా? వాటితో మీ కిచెన్ సువాసన వచ్చేలా చేసుకోవచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ - లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget