Tea Leaves: వాడేసిన టీఆకులు పారేస్తున్నారా? వాటితో మీ కిచెన్ సువాసన వచ్చేలా చేసుకోవచ్చు
మాన్ సూన్ సీజన్ లో కిచెన్ లో కాస్త తడి వాతావరణం ఉన్నా కూడా దుర్వాసన వచ్చేస్తుంది. సింక్ దగ్గర ఈగలు మూగేస్తాయి. వాటిని పోగొట్టేందుకు ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.
ఉదయం నిద్రలేవగానే టీతో తమ రోజు ప్రారంభించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని సువాసన మనల్ని నిద్ర నుంచి మేల్కొనెలా చేస్తుంది. కాఫీ కంటే టీ మంచిదని అంటారు. అందుకే ఇది ప్రతిష్టాత్మకమైన పానీయంగా పేరు గాంచింది. టీ తాగడం వరకు బాగానే ఉంది మరి ఆ టీ ఆకులు ఎప్పుడు పారేస్తూనే ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే టీ మాత్రమే కాదు దాని ఆకులు లేదా డికాషన్ కూడా ఉపయోగించుకోవాలే కానీ అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఈ టీ ఆకులు చెట్లకి ఎరువుగా మాత్రమే కాదు ఇతర మార్గాల్లోను ఉపయోగించుకోవచ్చు.
వంటకి రంగునిస్తుంది
పిండి చోలే లేదా భాతురే తయారు చేసేటప్పుడు ఈ టీ ఆకులు తప్పనిసరిగా వినియోగిస్తారు. వీటిని హిందీలో ఛాయ్ పట్టీ కా పానీ అని పిలుస్తారు. చోలేకి వచ్చి గోధుమ రంగు బ్రూడ్ టీ ఆకుల నుంచి వస్తుంది. శనగలతో పొట్లి తయారు చేసేటప్పుడు ఒక టీ స్పూన్ టీ ఆకులని మస్లిన్ క్లాత్ లో కట్టి వాటితో పాటు గిలకొట్టాలి. ఈ పొట్లిని కుక్కర్ లో వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 30-40 నిమిషాల పాటు శనగలతో కలిపి ఉన్న టీ క్లాత్ అలాగే ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బయటకి తీసి చూస్తే శనగల నీరు గోధుమ రంగులోకి మారిపోతుంది. టీ ఆకుల వాసన ఆహారానికి ఏ మాత్రం అంటుకోదు. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలతో వండిన ఈ నీటిలో టీ ఆకుల రుచి అసలు ఉండదు.
రూమ్ స్ప్రే
వర్షాకాలంలో ఇంటితో పాటు కిచెన్ కూడా ఒక విధమైన దుర్వాసన వస్తుంది. ఈగలు కిచెన్ సింక్ దగ్గర, డస్ట్ బిన్ దగ్గర తిరుగుతూ మళ్ళీ వచ్చి ఆహార పదార్థాల మీద వాలుతాయి. వీటి వల్ల దుర్వాసన వస్తుంది. దీన్ని పోగొట్టేందుకు ఈ టీ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి. 3,4 చిన్న, శుభ్రమైన క్లాత్స్ తీసుకోవాలి. వాటిలో ఒక్కొక్క టీ స్పూన్ టీ ఆకులు వేసుకోవాలి. అందులో 2-3 చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లేదా ఏదైనా ఇతర ఆయిల్ వేసి బిర్రుగా మూతి కట్టేయాలి. వీటిని కిచెన్ లోని వివిధ మూలల పెట్టుకోవచ్చు. డస్ట్ బిన్, కిచెన్ సింక్ దగ్గర లేదా వంట గది కిటికీకి వేలాడదీయవచ్చు. దీనితో మీ కిచెన్ మంచి వాసన వస్తుంది.
చాపింగ్ బోర్డ్ క్లీనింగ్
కూరగాయలు కట్ చేసుకునే చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసుకోవడానికి ఈ టీ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి. ఒక టీ స్పూన్ ఆకుల్ని ఒక కప్పు నీటిలో వేసి వేడి చేసుకోవాలి. అందులో నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మురికిగా ఉన్న చాపింగ్ బోర్డ్ కి ఒక టీ స్పూన్ డిష్ వాష్, తడి టీ ఆకులు స్క్రబ్ లాగా పని చేస్తాయి. బోర్డు నుంచి బ్యాక్టీరియాని కూడా తొలగిస్తాయి. తర్వాత మంచి నీటితో బోర్డ్ శుభ్రంగా కడిగితే సరిపోతుంది.
టీ ఆకులతో డెజర్ట్
ఎప్పుడైనా టీ ఆకులతో డెజర్ట్ చేసుకున్నారా? కొత్తవి ట్రై చేసే వారికి ఇది బాగా పనికొస్తుంది. ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఉప్పు, టీ ఆకులు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా చక్కెర, వెనీలా, బటర్ వేసి మళ్ళీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ ర్యాప్ షీట్ మీద 2 అంగుళాల మందంతో వేసుకోవాలి. 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో చల్లబరుచుకోవాలి. ఆ తర్వాత ఓవెన్ లో పెట్టుకుని 190 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని బయటకి తీసి బేకింగ్ షీట్ చుట్టిన ట్రేలో ఉంచి సుమారు 12 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చల్లబడిన తర్వాత దీన్ని తింటే సూపర్ గా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ స్పెషల్ టీలు తాగారంటే వర్షాకాలంలో రోగాల భయమే అక్కర్లేదు