అన్వేషించండి

Depression: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం

(Depression) పండ్లు తినేవారికి మానసికంగా ఎంతో శక్తిమంతంగా ఉంటారు.

Depression: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. బరువు పెరగక పోవడం, శరీరంలో అవయవాలకు ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను రాకుండా అడ్డుకుంటాయి.అయితే ఇప్పుడు ఒక అధ్యయనం మరొక విషయాన్ని తేల్చి చెప్పింది. పండ్లు తినని వారితో పోలిస్తే, తినే వారిలో డిప్రెషన్, మానసిక సమస్యలు వచ్చే అవకాశం తక్కువట. ఇక చిప్స్ వంటి చిరుతిళ్లను తినే వారిలో మానసిక ఆందోళనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 

అధ్యయనం ఇలా సాగింది
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం 428 పెద్దలపై ఈ సర్వే జరిగింది. వారు తీసుకునే పండ్లు, కూరగాయలు, తీపి, కారం పదార్థాలు, స్నాక్స్ వంటివి పరిశీలించింది. ఆహారానికి మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని పరిశీలించింది. పోషకాలు అధికంగా ఉండే పండ్లు, పోషకాలే లేని స్నాక్స్... ఈ రెండూ కూడా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నట్టు గుర్తించారు.కానీ కూరగాయలకు మానసిక ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం కనుగొనలేకపోయారు. ఎవరైతే స్నాక్స్ కు బదులు పండ్లు అధికంగా తింటారో వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

 ఈ అధ్యయనంలో భాగమైన ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు మాట్లాడుతూ ‘మనం తినే ఆహారం మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు ఎలా ప్రభావితం చేస్తుందన్నది ఇంతవరకు తక్కువగా తెలుసు. పోషకాలు లేని రుచికరమైన స్నాక్స్ అధికంగా తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని మా పరిశోధనలు సూచిస్తున్నాయి. పండ్లు తినేవారిలో మాత్రం మానసిక ఆరోగ్యం చక్కగా ఉంది’ అని వివరించారు. 

పండ్లు, కూరగాయలు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అవసరమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. అయితే కూరగాయలు వండేటప్పుడు కొన్ని పోషకాలను కోల్పోతాము. మనం పండ్లను పచ్చిగా తింటాం కాబట్టి, అందులోంచి కోల్పోయేదేమీ ఉండదు. అందుకే పండ్లు తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై బలమైన ప్రభావం పడుతుంది. 

ఈ అధ్యయనం కోసం ఓ సర్వేను నిర్వహించారు పరిశోధకులు. అందులో ప్రజలు ఎంత తరచుగా పండ్లను తింటారు, వారు ఎప్పుడైనా డిప్రెషన్ కు గురయ్యారా, జంక్ ఫుడ్, స్నాక్స్ వంటివి అధికంగా తింటారా, వాటిని ఎంత తరచుగా తింటారు వంటి ప్రశ్నావళితో సర్వే నిర్వహించారు. ఎవరైతే పండ్లు తినకుండా ఇతర స్నాక్స్ వంటివి ఎక్కువగా తింటారో వారిలో మానసిక లోపాలు తలెత్తుతున్నట్టు గుర్తించారు. వీటిని ఆబ్టెక్టివ్ కాగ్నిటివ్ ఫెయిల్యూర్స్ అని పిలుస్తారు. వీరిలో అధికంగా ఒత్తిడి, నిరాశ వంటివి కలుగుతాయి. పండ్లు అధికంగా తినే వారిలో వీటి ఛాయలు తక్కువగా ఉన్నాయి. అందుకే పండ్లు తినమని సిఫారసు చేస్తున్నారు అధ్యయనకర్తలు. 

Also read: చల్ల మిరపకాయలు ఇలా చేసుకుంటే కారం కారంగా భలేగుంటాయ్

Also read: చిక్కని పాయ సూప్ రెసిపీ, చల్లని వేళ రోగనిరోధక శక్తిని పెంచే వెచ్చని రుచి

Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget