అన్వేషించండి

Challa Mirapakayalu: చల్ల మిరపకాయలు ఇలా చేసుకుంటే కారం కారంగా భలేగుంటాయ్

చల్ల మిరపకాయలు ప్రాచీనకాలం నాటి ఆహారం.

కొంతమంది చల్ల మిరపకాయలు అంటారు. మరికొంతమంది మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అని కూడా అంటారు.  ఇవి తెలుగు సాంప్రదాయపు వంటల్లో భాగం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వంటకం మన ఆహారం భాగమై ఉంది. వడియాలు, అప్పడాలు కోవకే ఇది కూడా చెందుతుంది. సాంబారు, పప్పన్నం, పెరుగన్నానికి జతగా వీటిని తింటారు. కాస్త కారంగా భలే రుచిగా ఉంటాయి. ఒక్కసారి వీటి రుచి నచ్చిందో మరి వదలలేరు. అమ్మమ్మలు, నాన్నమ్మల కాలంలో  వీటిని బాగా చేసేవాళ్లు. ఇప్పుడు మార్కెట్లో ఇవి దొరకుతున్నా, ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఉప్పును అధికంగా వేస్తున్నారు. దీని వల్ల రుచి ఉండదు సరికదా, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వారు తినలేరు. 

కావాల్సిన పదార్థాలు
పచ్చి మిర్చి - కిలో
పుల్లని పెరుగు - అర లీటరు
ఉప్పు - రుచికి సరిపడా 

తయారీ ఇలా
1. పచ్చి మిరపకాయలు పొడవుగా, కాస్త ముదురు రంగులో ఉన్నవి ఎంచుకోవాలి. లావుగా ఉండేలా చూసుకోవాలి. 
2. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మధ్యలో నిలువుగా కోసుకోవాలి. 
3. పెరుగును తీసుకుని బాగా గిలక్కొట్టి మజ్జిగ చేసుకోవాలి. అందులో రెండు స్పూనుల ఉప్పు వేయాలి. 
4. మరీ అధికంగా నీళ్లు పోయకూడదు. మజ్జిక కాస్త చిక్కగా ఉండేలా చూసుకోవాలి. పుల్లని పెరుగైతే చాలా మంచిది. 
5. ఆ మజ్జిగలో మిరపకాయలను వేసి మూత పెట్టాలి. 
6. మూడు రోజుల పాటూ అలా ఉంచితే బాగా ఊరుతాయి. 
7. మూడు రోజుల తరువాత తీసి ఎర్రటి ఎండలో ఒక్కో మిరపకాయను విడదీసి వస్త్రంపై ఎండబెట్టాలి. 
8. ఉదయమంతా ఎండిన మిరపకాయలను రాత్రి మళ్లీ  అదే మజ్జిగలో వేయాలి. 
9. అలా మూడు రోజుల పాటూ చేయాలి. 
10. అలా చేయడం వల్ల మజ్జిగంతా బాగా మిరపకాయల్లోకి బాగా ఊరుతుంది. 
11. తరువాత మాత్రం మిరపకాయలను ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి. గిన్నెల వేస్తే గలగలలాడేంతగా బాగా ఎండాక ఓ సీసాలో వేసుకుని దాచుకోవాలి. 
12. నూనెలో  వేయించుకుని సాంబారన్న లేదా పప్పన్నంతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పెరుగన్నం, మజ్జిగన్నంతో తిన్నా బావుంటాయి. 

Also read: రోజుకు ఎన్ని నీళ్లు తాగితే హైబీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు?

Also read: చిక్కని పాయ సూప్ రెసిపీ, చల్లని వేళ రోగనిరోధక శక్తిని పెంచే వెచ్చని రుచి

Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది

టాప్ హెడ్ లైన్స్

Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య.. అంతలోనే ఏం జరిగింది?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Embed widget