By: Haritha | Updated at : 17 Jul 2022 12:10 PM (IST)
(Image credit: Youtube)
వానాకాలంలో సాయంత్రం వేళ మరింత చల్లగా మారిపోతుంది. ఆ వేళలో వేడి వేడిగా పాయ సూప్ తాగితే ఆ కిక్కే వేరు. అందులోనూ వర్షాకాలంలో వైరస్, బ్యాక్టిరియాలు త్వరగా దాడి చేస్తాయి. వాటి దాడి నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం. మటన్ పాయ సూప్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
నల్లీ బోన్స్ - నాలుగు
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు
టోమాటో ప్యూరీ - అరకప్పు
మిరియాల పొడి - అర చెంచా
దాల్చిన చెక్క - రెండు ముక్కలు
యాలకులు - రెండు
లవంగాలు - అయిదు
ధనియాల పొడి - పావు చెంచా
కారం - ఒక స్పూను
జాజికాయ పొడి - చిటికెడు
బిర్యానీ ఆకులు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా
1. నల్లీ బోన్స్ శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేయాలి. ఉల్లి తరుగును మూడు భాగాలుగా చేసి పెట్టుకోవాలి.
2. అదే కుక్కర్లో నాలుగు స్పూన్ల ఉల్లిపాయ తరుగు, కాస్త నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, గ్లాసున్నర నీళ్లు, పసుపు, ఉప్పు కలిపి వేసి బాగా కలపాలి.
3. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఉడికించాలి. మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే లోపలి మిశ్రమం మెత్తగా అవుతుంది.
4. ఇప్పుడు మిక్సీ జార్లో మిగతా ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి కాస్త నీళ్లు చేర్చి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక బిర్యానీ ఆకులు, ఉల్లి తరుగు వేసి వేయించాలి.
6. మిక్సీలో మనం ముందే రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. తరువాత టమోటా ప్యూరీ కూడా వేయించాలి.
7. అన్నీ వేగాక కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలి.
8. తరువాత కుక్కర్లోని నల్లీ బోన్స్ మిశ్రమాన్ని, నీళ్లను కూడా వేసి కలపాలి.
9. దీన్ని చిక్కగా అయ్యేవరకు మరిగించుకోవాలి.
10. స్టవ్ కట్టే ముందు పైన కొత్తిమీర చల్లుకోవాలి.
Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది
Also read: రాత్రి ఎనిమిది తరువాత తినకూడని ఆహారాలు ఇవే, తింటే ఈ సమస్యలు తప్పవు
Also read: వానాకాలంలో అరటి పండ్లు తినొచ్చా? పిల్లలకు పెట్టొచ్చా?
Viral news: కోడి పుంజు కూయడం నేరమా? కోర్టుకెళ్లిన జర్మన్ దంపతులు..
Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..
Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?
WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
ప్రేయసి హ్యాండ్ బ్యాగ్‌పై మూత్రం పోసిన ప్రియుడు - ఊహించని తీర్పిచ్చిన కోర్టు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!