News
News
X

Foods: రాత్రి ఎనిమిది తరువాత తినకూడని ఆహారాలు ఇవే, తింటే ఈ సమస్యలు తప్పవు

రాత్రి పూట తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏది పడితే అది తింటే అనారోగ్యం తప్పదు.

FOLLOW US: 

రాత్రి భోజనం ఎనిమిది గంటల్లోపే తినమని చెబుతారు ఆరోగ్యనిపుణులు. కానీ చాలా మంది రాత్రి తొమ్మిది దాటాకే తింటుంటారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్లే చాలా మంది బరువు పెరుగుతున్నట్టు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయినా ఎంత మంది రాత్రి ఎనిమిది లోపు భోజనం పూర్తి చేస్తున్నారా? సర్వే ప్రకారం చాలా తక్కువ శాతం మంది అనే చెప్పాలి. పోషకాహారా నిపుణుడు పాలక్ మిధా చెప్పిన ప్రకారం ‘నిద్ర పోవడానికి రెండు మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి. ఒక వేళ నిద్రపోవడానికి ఒక గంట ముందే అయితే తేలికపాటి భోజనం తినాలి’ అని సూచిస్తున్నారు. భారీ భోజనం తిని వెంటనే నిద్రపోతే సులువుగా బరువు పెరిగిపోతారు. నిజానికి తేలికపాటి ఆహారం తిని పడుకుంటే నిద్రలోనే మనం బరువు తగ్గుతాం. 

హెల్త్ లైనో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఎవరైతే లేటుగా రాత్రి భోజనం చేస్తారో వారు అవసరం అయిన దానికంటే అధికంగా తింటారు. అదే ఎనిమిదిలోపే తినేవారు సాధారణం కన్నా కాస్త తక్కువగానే తింటారు. రాత్రి లేటుగా ఆహారం తినాల్సి వస్తే కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్ ను ఎంచుకోవాలి. అలాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. అలాగే తిన్నాక కాసేపు వాకింగ్ చేయాలి. 

వీటిని తినవద్దు
రాత్రి ఎనిమిది గంటల తరువాత ఈ ఆహారాన్ని తినకూడదు. 

చాకోలెట్లు
తీపి కోరికలను అధిగమించక తప్పదు. రాత్రి ఎనిమిది దాటాక చాకోలెట్లు తినకూడదు. ఇవి అధికంగా కేలరీలను జోడిస్తాయి. అంతేకాదు, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉంటాయి కాబట్టి, ఇది మిమ్మల్ని మేల్కొనే ఉండేలా చేస్తుంది. 

ఆల్కహాల్
బరువు పెంచడానికి, నిద్రకు భంగం కలిగించడానికి ఆల్కహాల్ ముందుంటుంది. అందుకే రాత్రి పూట మద్యం తాగకూడదు. బరువు తగ్గాలనుకునేవారు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. 

చిప్స్
చిప్స్ ను డీప్ ఫ్రై చేస్తారు. అవి కేలరీలతో నిండి ఉంటాయి. చాలా మంది టీవీ చూస్తూ చిప్స్ ను లాగించేస్తారు. ఆహారం తిన్నాక కూడా కొంతమంది రాత్రి టీవీ చూస్తూ చిప్స్ తింటారు. ఆ అలవాటును వదిలేయండి. 

కూల్ డ్రింకులు
బిర్యానీ తింటూ కూల్ డ్రింకులు లేట్ నైట్ లాగిస్తున్నారా? అయితే బరువు పెరిగిపోతారు, అలాగే అనారోగ్యాలూ తప్పవు. వీటిలో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. కూల్ డ్రింకులు తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. 

ఐస్ క్రీములు
అర్థరాత్రి ఐస్ క్రీములు తిన్నవాడే రొమాంటిక్ ఫెలో అని చెప్పుకునే వారు ఎంతో మంది. అలా చెప్పుకునే వారు రాబోయే జబ్బులను కూడా తెలుసుకుని తింటే మంచిది. ఐస్ క్రీమ్ రాత్రి పూట తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి తినడం మానేయండి. 

పైన చెప్పిన ఆహారాలు తరచూ రాత్రి పూట తినడం వల్ల ఊబకాయంతో పాటూ, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు, నిద్రలేమి వంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువ. 

Also read: వానాకాలంలో అరటి పండ్లు తినొచ్చా? పిల్లలకు పెట్టొచ్చా?

Also read: ఒమిక్రాన్ BA.5 మిగతా వేరియంట్లతో పోలిస్తే చాలా పవర్ ఫుల్, వ్యాక్సిన్ వేసుకున్నా వదలడం లేదు

Published at : 17 Jul 2022 09:25 AM (IST) Tags: Foods Dont Eat these Food Late night food food Cravings

సంబంధిత కథనాలు

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Hair Care: ఈ ఒక్క నూనెతో జుట్టు సమస్యలన్నీ మటాష్, ఎన్ని ప్రయోజనాలో చూడండి

Hair Care: ఈ ఒక్క నూనెతో జుట్టు సమస్యలన్నీ మటాష్, ఎన్ని ప్రయోజనాలో చూడండి

Antibiotics: యాంటీబయోటిక్ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమా?

Antibiotics: యాంటీబయోటిక్ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమా?

Diabetes: భోజనం చేశాక కాసేపు నడిస్తే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం, చెబుతున్న పరిశోధకులు

Diabetes: భోజనం చేశాక కాసేపు నడిస్తే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం, చెబుతున్న పరిశోధకులు

Methi: టెస్టోస్టెరాన్ హార్మోనుకు మెంతులు ఎంత ఉపయోగమో తెలుసా? అందుకే మగవారు వాటిని మెనూలో చేర్చుకోవాల్సిందే

Methi: టెస్టోస్టెరాన్ హార్మోనుకు మెంతులు ఎంత ఉపయోగమో తెలుసా? అందుకే మగవారు వాటిని మెనూలో చేర్చుకోవాల్సిందే

టాప్ స్టోరీస్

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్