News
News
X

కక్కుర్తి పడితే ఇంతే, ఆ ఫుడ్ కోసం తమ పేర్లను ఫన్నీగా మార్చుకున్న జనం, షాకిచ్చిన ప్రభుత్వం

ఆ ఫుడ్ కోసం కక్కుర్తిపడి తమ పేర్లను ఫన్నీ నేమ్స్‌తో మార్చేసుకున్నారు. ఇది తెలిసి ప్రభుత్వం చట్టం మార్చడంతో వారంతా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు.

FOLLOW US: 
Share:

సొంత పేరును మార్చుకోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎంతో ముఖ్యమైతే తప్పా.. తమ పేరును మార్చుకోరు. ఎందుకంటే, తమ పుట్టిన రోజు నుంచి మిగతా ఐడీలు, పథకాల్లో అన్నీ తల్లిదండ్రులు పుట్టిన పేర్లే ఉంటాయి. పేరు మార్చుకుంటే.. మళ్లీ అవన్నీ మార్చుకోవాలి. లీగల్‌గా కూడా చాలా సమస్యలు వస్తాయి. దీంతో చాలామంది తమ పేర్లను మార్చుకోడానికి పెద్దగా ఇష్టపడరు. తమకు నచ్చినా, నచ్చకపోయినా ఆ పేరునే ఉంచేసుకుంటారు. అయితే, తైవాన్‌లో మాత్రం వందలాది మంది తమ పేర్లను మార్చేసుకోవడాన్ని అక్కడి శాసనసభనే కుదిపేసింది. వారంతా తమ పేర్లను ‘సాల్మన్‌’గా మార్చుకోవడం చూసి ప్రజా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. చట్టంలో మార్పులు తేవడంతో వారిలో సగం మంది పేర్లను తిరిగి మార్చుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇంతకీ వారంతా తమ పేర్లను ‘సాల్మన్’గా ఎందుకు మార్చుకుంటున్నరనేగా? మీ సందేహం. ఇదంతా ఓ ఫేవరెట్ ఫుడ్ కోసం. 

మీరు ఎంతో ఇష్టపడే ఫుడ్‌ ఉచితంగా లభిస్తుందంటే ఏం చేస్తారు? వెంటనే అడ్రస్ తెలుసుకుని మరీ లాగించేస్తారు కదా. తైవాన్‌ ప్రజలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఓ రెస్టారెంట్ తమ ప్రమోషన్‌లో భాగంగా ‘తైవాన్ సుషీ’ని ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఇక్కడే ఒక మెలిక కూడా పెట్టింది. వారి పేర్లలో ‘సాల్మన్’ అనే పదం ఉంటేనే దీనికి అర్హులని తెలిపింది. దీంతో ఆ పేరు తమకు లేనందుకు చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. కొందరు మాత్రం తమ పేర్లను ‘సాల్మన్’గా మార్చుకుని మరీ ఆ ఉచితంగా లభించిన సుషీని లొట్టలేసుకుని మరీ తినేశారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 300 మందికి పైగా తమ పేర్లను ‘సాల్మన్’గా మార్చుకున్నారట. వారి పేర్లు వింటే మీరు తప్పకుండా నవ్వేస్తారు. 

తైవాన్ శాసనసభ్యులు ఈ పరిణామాన్ని ‘సాల్మన్ ఖోస్’గా అభివర్ణించారు. 2021, మార్చి నెలలో చోటుచేసుకున్న ఈ పరిణామంలో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఆ రెస్టారెంట్ ప్రకటన వచ్చిన కొద్ది రోజుల్లోనే వందలాది మంది చట్టబద్దంగా తమ పేరును ‘సాల్మన్’గా మార్చుకున్నారు. అయితే, వారు అందమైన పేర్లు పెట్టుకుంటే బాగుండేది. కానీ, వారిలో కొందరు తమ పేర్లను ఫన్నీగా పెట్టుకున్నారు. ‘హ్యాండ్సమ్ సాల్మన్’, ‘డ్యాన్సింగ్ సాల్మన్’, ‘సాల్మన్ డ్రీమ్’ తదితర పేర్లను పెట్టుకున్నారు. రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు అలా చేయొద్దని చెప్పినా ఎవరూ మాట వినలేదట. ఇలా పేర్లు మార్చుకున్నవారిలో చాలామంది ఇంకా మార్చుకున్న పేర్లతోనే కొనసాగుతున్నట్లు తెలిసింది. తైవాన్ రాజకీయ నాయకులు దీన్ని జాతీయ అవమానంగా అభివర్ణించారు.

Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి..

కొందరు మాత్రం తమ కోరికను తీర్చుకుని తమ పేర్లను మళ్లీ తమ అసలు పేర్లలోకి మార్చుకున్నారట. ఆ రెస్టారెంట్ ఆఫర్, ప్రజలు చేసిన పని వల్ల ప్రభుత్వ వనరులు, అధికారుల సమయం వృధా అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో అక్కడి ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. కేవలం మూడు సార్లు మాత్రమే పేరును మార్చుకోడానికి అనుమతి ఇచ్చింది. దీంతో అప్పటికే అప్పటికే మూడుసార్లు పేరు మార్చుకున్న వ్యక్తులు చిక్కుల్లో పాడ్డారు. కొందరు ఇప్పటికీ పేరు మార్చుకోలేక ఆ ఫన్నీ పేర్లతోనే కొనసాగుతున్నారు. ‘ట్రూంగ్స్ సాల్మన్ డ్రీమ్’ అని పేరు పెట్టుకున్న ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నా బాల్యంలోనే రెండుసార్లు పేర్లు మార్చారు. ఇప్పుడు నేను ‘సాల్మన్’గా పేరు మార్చుకోవడం వల్ల మూడో ఛాన్స్ కూడా అయిపోయింది. చట్టం మార్చడం వల్ల ఇప్పుడు నేను ఈ పేరుతోనే కొనసాగాలి’’ అని వాపోయాడు. పేరు మార్పుకు పరిమితి కాకుండా, భారీ ఫీజులు, వెయిటింగ్ లిస్ట్ వంటివి పెడితే ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుందని పలువురు సలహా ఇస్తున్నారు. కానీ, ఇప్పట్లో చట్టాన్ని మళ్లీ మార్చే అవకాశం లేదు. అలా పేరు మార్చుకున్న చాలామంది తలలు పట్టుకుని లబోదిబో అంటున్నారు. 

Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Published at : 01 Jun 2022 08:11 PM (IST) Tags: Name Change Name Change To Salmon Salmon Salmon Name Name Change For Sushi

సంబంధిత కథనాలు

రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం

ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా

Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

టాప్ స్టోరీస్

BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే

BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే

Kalyan Ram: అత్యంత విషమంగా తారకరత్న హెల్త్ కండీషన్, నందమూరి కల్యాణ్ రామ్ కీలక నిర్ణయం!

Kalyan Ram: అత్యంత విషమంగా తారకరత్న హెల్త్ కండీషన్, నందమూరి కల్యాణ్ రామ్ కీలక నిర్ణయం!

Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్

Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్

Breaking News Live Telugu Updates: తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు బయల్దేరిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Breaking News Live Telugu Updates: తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు బయల్దేరిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్