Stop Balding and Hair Falling: అధికంగా జుట్టు రాలుతోందా... ఇవి ట్రై చేయండి
కొందరికి అధికంగా జుట్టు రాలుతుంది.. బట్టతల ఛాయలు కూడా కనిపిస్తాయి. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
జుట్టు రాలడం అనేది చిన్న సమస్యలా కనిపిస్తుంది కానీ, అది ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పడు జుట్టు రాలడం కూడా పెద్ద సమస్యగానే పరిణమిస్తోంది. అధికంగా జుట్టు రాలుతున్నప్పుడు, బట్టతల వస్తుందేమో అన్న భయం ఉన్నవారు ఇంటి దగ్గరే కొన్ని చిట్కాలు పాటిస్తే... జుట్టు ఎదుగుదల బావుంటుంది. అయితే పూర్తిగా బట్టతల వచ్చిన వారికి ఈ చిట్కాలు పనిచేయవు. జుట్టు ఊడడం ప్రాథమిక స్థాయిలో ఉన్న వారికే ఈ చిట్కాలు...
1. ఆయిల్ మసాజ్
చాలా మంది దీన్ని తక్కువ అంచనా వేస్తారు కానీ ఇది మంచి ఫలితాన్నే ఇస్తుంది. తరచూ నూనెతో తలకు మసాజ్ చేస్తుంటే, జుట్టు కుదుళ్లు బలంగా మారడంతో పాటూ, జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
2. అలొవెరా
అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా పనిచేసే చిట్కా ఇది. కలబంద జెల్ ను మాడుకు పట్టించి గంట తరువాత వాష్ చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
3. చేప నూనె
ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ క్యాప్సూల్స్ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
4. ఉల్లిపాయ రసం
దీని వాసన బాగుండకపోవచ్చు, ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ తలకి పట్టించడం వల్ల కొన్ని రోజుల్లోనే జుట్టు ఎదుగుదల మొదలవుతుంది.
5. నిమ్మరసం
నిమ్మరసాన్ని, కొబ్బరి నూనెలో కలిపి మాడుకి పట్టిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. కొన్ని రోజుల్లోనే జుట్టు పెరుగుదలను మీరు గుర్తిస్తారు.
కాస్త ఛిల్ అవ్వండి...
జుట్టురాలిపోవడానికి ఒత్తిడి కూడా కారణం కావచ్చు. కాబట్టి అధిక ఒత్తిడికి గురవ్వకుండా కాస్త ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అధిక పని గంటల వల్ల ఒత్తిడి అధికమవుతుంది. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి.
కేవలం చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడం ఆగిపోదు, దానికి మంచి పోషకాహారం కూడా తోడవ్వాలి. చేపలు, నట్స్, ఆకుకూరలు, తాజా కూరగాయలు మీ డైట్ లో ఉండేలా చూసుకోండి.
Also read: ఈ నల్లకోడి ప్రత్యేకతలు తెలిస్తే.. తప్పకుండా గుటకలు వేస్తారు
Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్
Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్