IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Black Chicken: ఈ నల్లకోడి ప్రత్యేకతలు తెలిస్తే.. తప్పకుండా గుటకలు వేస్తారు

బ్రాయిలర్ కోళ్లు, ఊళ్లల్లో పెంచే నాటు కోళ్లు మనకు విరివిగా దొరుకుతూనే ఉంటాయి. వీటితో పోలిస్తే ఈ నల్లకోళ్లు చాలా స్పెషల్.

FOLLOW US: 

ఇవి కోళ్లే... కానీ చాలా ప్రత్యేకమైనవి. సాధారణ కోళ్లతో పోలిస్తే వీటి ద్వారా అందే పోషకాలు కూడా అధికం. రుచి కూడా భిన్నంగా ఉంటోంది. ప్రపంచంలో ఇలాంటి నల్లకోళ్లు కేవలం మూడే రకాలు ఉన్నాయి. వాటిలో ఒకరకం మనదేశనంలోనే ఉంది. అవే కడక్ నాథ్ కోళ్లు. ఇక చైనాలో సిల్కీ రకం, ఇండోనేషియాలో అయమ్ సెమనీ... ఇవన్నీ కూడా నల్లకోళ్ల జాతివే. కేవలం వీటి ఈకలే కాదు, లోపల మాంసం కూడా నలుపురంగులోనే ఉంటుంది. అదే వీటి ప్రత్యేకత. ఇవి నల్లగా ఉన్నప్పటికీ గుడ్లు మాత్రం క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఫైబ్రోమెలనోసిస్ అనే వర్ణద్రవ్యం కారణంగా వీటికి ఇంత ముదురు నలుపురంగు వచ్చింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ చెప్పిన ప్రకారం ప్రపంచంలో అత్యంత ముదురు రంగు వర్ణద్రవ్యాన్ని కలిగిన జీవి ఇదే. 

మనదేశంలో...
సోషల్ మీడియాలో ఎక్కువగా వీటి ఫోటోలు వైరల్ అవుతుంటాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కడక్ నాథ్ కోళ్లు దొరుకుతుంటాయి. వీటిని ‘కాళీమాసీ’ అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని గిరిజనుల అధికంగా నివసించే జబువా జిల్లాను వీటి పుట్టినిల్లుగా చెబుతారు. అక్కడ నివసించే ఆదివాసీలలోని నిరుపేదలు వీటిని పెంచి, అమ్ముకోవడం ద్వారా జీవనం సాగించేవారు. ఇప్పుడు కడక్ నాథ్ కోళ్ల పెంపకం పెద్ద వ్యాపార మార్గంగా మారిపోయింది. చాలా మంది కోళ్ల వ్యాపారులు వీటిని పెంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నారు.  

రుచి, పోషకాలు సూపర్
ఈ కోడి మాంసం చాలా మేలు చేస్తుంది. మహిళల్లో అధిక రక్తస్రావాలను, గర్భస్రావాలను, ప్రసవ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే పురుషుల్లో కూడా నరాల బలహీనతను తగ్గించి, వయాగ్రాల పనిచేస్తుంది. ఇందులో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. నిమోనియా, రక్త హీనత, ఆస్తమా, క్షయ వ్యాధిగ్రస్తులు ఈ నల్లకోడి కూరని తింటే చాలా మంచిదని చెబుతున్నారు పోషకాహారనిపుణులు. మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ కోడి మాంసం గుండెకి మేలుచేస్తుందని తేలింది. వీటి గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ప్రోటీన్, ఇనుము పుష్కలంగా లభిస్తుంది. వీటిని తింటే నీరసం దరిచేరదు. 

Also read: Good touch And Bad touch: పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కొన్ని చిట్కాలు ఇవిగో...

Also read: యూరిన్ రంగు మారిందా? జాగ్రత్త పడండి

Also read: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు

Published at : 16 Sep 2021 11:46 AM (IST) Tags: chicken curry Black Chicken Kadaknath Black hen

సంబంధిత కథనాలు

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

టాప్ స్టోరీస్

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో  తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!