By: ABP Desam | Updated at : 16 Sep 2021 07:33 AM (IST)
గ్రీన్ టీ
గ్రీన్ టీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చాలా మంది సన్నబడటానికి తమ డైట్ లో దీన్ని భాగం చేసుకుంటారు. అంతేకాదు వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడే తాగేస్తుంటారు. త్వరగా బరువు తగ్గాలని, ఆరోగ్యం మరింత మెరుగవ్వాలని రోజూ తాగే మూడు నాలుగు సార్లు ఆ టీని పొట్టలో వేసేవాళ్లూ ఉన్నారు. కానీ ఇది గ్రీన్ టీ తాగేందుకు సరైన పద్దతి కాదు. చాలా మందికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలో, ఏ సమయాలలో తాగకూడదో తెలియదు. ఈ టీ ఎప్పుడెప్పుడు తాగకూడదో ఓసారి చూద్ధాం.
ఎప్పుడెప్పుడు తాగకూడదంటే....
1. చాలామంది చేసే తప్పు ఇదే. గ్రీన్ టీ ఎప్పుడు తాగినా ఆరోగ్యకరమే అనుకుంటారు. నిజానికి సుష్టుగా భోజనం చేశాక గ్రీన్ టీ తాగకూడదు. ఆహారం ద్వారా అందిన ప్రోటీన్లు ఇంకా జీర్ణమయ్యే ప్రక్రియకు గ్రీన్ టీ వల్ల భంగం కలిగే అవకాశం ఉంది.
2. బాగా వేడిగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగడం వల్ల లాభాలు తక్కువ. అదే కాస్త గోరువెచ్చగా చల్లారాక తాగితే శరీరానికి బోలెడన్నీ లాభాలు అందుతాయి.
3. పరగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు గ్రీన్ టీ సేవించడం అంత మంచిది కాదు. ఈ టీలో యాంటీ ఆక్సిండెంట్లు, పాలఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖాళీ పొట్టతో దీన్ని తాగడం వల్ల ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయి జీర్ణక్రియ దెబ్బతింటుంది. రెండు భోజనాలకు మధ్య కాలంలో తాగడం ఉత్తమం.
4. చాలా మంది గ్రీన్ టీ ప్రేమికులు అందులో తేనె కలుపుకుని తాగుతుంటారు. అది మంచి పద్దతే కానీ... గ్రీన్ టీ చాలా వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు. ఇలా చేయడం వల్ల తేనెలోని పోషకగుణాలు నశిస్తాయి.
5. కొంతమంది ఉదయం పూట వేసుకున్న ట్యాబ్లెట్లను గ్రీన్ టీతో తీసుకుంటారు. అది చాలా ప్రమాదకరం. ట్యాబ్లెట్లు గ్రీన్ టీతో కలిసి అనారోగ్యాన్ని కలిగించే రసాయన మిశ్రమంగా మారవచ్చు. కనుక నీటితోనే ట్యాబ్లెట్లను వేసుకోవాలి.
6. గ్రీన్ టీ మంచిదే కానీ, అతిగా తాగడం వల్ల మాత్రం ఆరోగ్య సమస్యలు మొదలవ్వచ్చు. ఇందులో కూడా కొద్ది మోతాదులో కెఫీన్ ఉంటుంది. రోజుకు నాలుగైదు కప్పులు తాగితే శరీరంలో కెఫీన్ అధికంగా పేరుకుపోవచ్చు. రోజుకు రెండు కప్పులకు మించి తాగకపోవడమే ఉత్తమం.
7. ఇక చివరగా గ్రీన్ టీ ని చాలా రిలాక్స్ డ్ మూడ్ లో తాగితే చాలా ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. బయటికెళ్లే కంగారులో గడగడ తాగడం వల్ల ప్రయోజనాలు సున్నా.
Also read: పిల్లలకి ఇవి తినిపించండి... రక్త హీనత దరిచేరదు
Also read: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే వీటిని తగ్గించండి...
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి... వైద్యుడిని కలవండి
Honey: తేనె నిజమైనదో కల్తీదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
Hair Loss: మీ షాంపూలో ఈ పదార్థాలు ఉంటే జుట్టు రాలిపోవడం ఖాయం!
HIV Vaccine: గుడ్ న్యూస్- హెచ్ఐవీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్- వచ్చే ఏడాదికి ఫలితాలు
Alzheimer's: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!
Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>