అన్వేషించండి

Signals of a Serious Illness: యూరిన్ రంగు మారిందా? జాగ్రత్త పడండి

చాలామంది యూరిన్ రంగును పెద్దగా పట్టించుకోరు. దాని గురించి మాట్లాడేందుకు కూడా మొహమాటపడతారు. కానీ మూత్రం రంగే ... మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

మూత్రవిసర్జన చాలా సాధారణ విషయం. అందుకే ఎక్కువ మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. రంగు మారినా పెద్దగా పట్టించుకోరు. కానీ మన ఆరోగ్యాన్ని సూచించే అద్భుతమైన సూచిక యూరిన్ రంగే.  అంతెందుకు అనారోగ్య సమస్యలతో వైద్యుడి వద్దకు వెళితే ఆయన రాసే టెస్టుల్లో యూరిన్ పరీక్ష కూడా కచ్చితంగా ఉంటుంది. చివరికి మూత్రపిండాలు తమ విధులను సక్రమంగా చేస్తున్నాయో లేదో ఒక్కోసారి యూరిన్ రంగు నిర్ణయిస్తుంది. అందుకే యూరిన్ రంగు మారితే తేలికగా తీసుకోవద్దు. 

1. ఎరుపు 
యూరిన్ రంగు కాస్త ఎరుపురంగులోకి మారితే తేలికగా తీసుకోకండి. బ్రిటన్ వైద్యుడు డెబోరా లీ ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం... మూత్రంలో రక్తం కనిపించడం, లేదా ఎరుపు రంగులో యూరిన్ కావడం అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. లేదా కిడ్నీలో రాళ్లు, ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా అవ్వచ్చు. మగవారిలో అయితే ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు ఉన్నా కూడా ఇలా మూత్రంలో రక్తం కనిపించవచ్చు. కాబట్టి యూరిన్ లో ఎరుపురంగు కనిపిస్తే నిర్లక్ష్యం వహించవద్దు. 
2. ఆరెంజ్ లేదా గ్రీన్
చాలా మంది నమ్మకపోవచ్చు కానీ... కొన్ని సందర్భాల్లో మూత్రం నీలం లేదా, ఆకుపచ్చ రంగుల్లో ఉండొచ్చు. క్లీవ్ ల్యాండ్కు చెందిన క్లినిక్ ఇచ్చిన సమాచారం ప్రకారం... కీమోథెరపీ కోసం ఇచ్చే మందులు మింగినప్పుడు మూత్రం నారింజ రంగులోకి మారుతుంది. క్యారెట్లు అధికంగా తిన్నప్పుడు, లేదా విటమిన్ సి మాత్రలు తీసుకున్నప్పుడు కూడా నారింజ రంగులో యూరిన్ పడుతుంది. బి విటమిన్ ట్యాబ్లెట్లు  యూరిన్ రంగును ఆకుపచ్చ రంగులోకి మారుస్తాయి.  ట్యాబ్లెట్లు ఆపేశాక కూడా యూరిన్ రంగు సాధారణంగా మారకపోతే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 
3. డార్క్ బ్రౌన్ రంగు
పచ్చకామెర్లతో బాధపడేవారికి మూత్రం డార్క్ బ్రౌన్ రంగులో వచ్చే అవకాశం ఎక్కువ. కాలేయం, పిత్తాశయం, పాంక్రియాస్ లలో ఇబ్బందులన్నవారికి యూరిన్ ఈ రంగులోకి మారుతుంది. ఎవరికైనా కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్లు పచ్చగా మారుతాయి, చర్మం కూడా రంగు మారుతుంది. అలాగే యూరిన్, మలం కూడా ముదురు గోధుమ రంగులోకి మారతాయి. కనుక ఎప్పుడైనా యూరిన్ డార్క్ బ్రౌన్ రంగులోకి మారితే తేలికగా తీసుకోవద్దు. 
4. క్లౌడీ 
అంటే యూరిన్ పారదర్శంగా ఉండకుండా, కాస్త అస్పష్టంగా, చిన్నచిన్న మలినాలతో కలిపి ఉంటుంది. దాన్ని క్లౌడీ యూరిన్ అంటాం. ఇలా ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. 
5. దుర్వాసన
యూరిన్ వాసన రావడం సహజం. ఒక్కోసారి రోజుకన్నా అతిగా ఘాటుగా వాసన వస్తుంది. ఆహారంలో ఘాటైనా పదార్థాలు అంటే మసాలాలు, వెల్లుల్లి, అల్లం అధికంగా తిన్నప్పుడు యూరిన్ ఘాటు వాసన రావచ్చు. అలాంటివి ఏమీ తినకపోయినా వాసన వస్తే మాత్రం అనుమానించాలి. వ్యక్తి తగినన్ని నీళ్లు తాగక డీహైడ్రేషన్ కు గురైతే ఇలా యూరిన్ అధికంగా వాసన వస్తుంది. లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also read: గ్రీన్ టీ తాగే పద్ధతి ఇది... ఎప్పుడుపడితే అప్పుడు తాగేయకూడదు

Also read: పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కొన్ని చిట్కాలు ఇవిగో...

Also read: పిల్లలకి ఇవి తినిపించండి... రక్త హీనత దరిచేరదు

టాప్ హెడ్ లైన్స్

Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Running After 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget