IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

New Study: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్

మనదేశంలో ఎక్కువ మంది ఆధారపడేది వరి అన్నం మీదే. అన్నం సరిగా ఉడికించకుండా తింటే చాలా ప్రమాదమని చెబుతున్నాయి కొత్త అధ్యయనాలు.

FOLLOW US: 

మనదేశంలో ప్రధానమైన  ఆహారం బియ్యం. దీన్ని వండడం కూడా చాలా సులువు. మితంగా తింటే ఎంతో ఆరోగ్యం. కానీ సరిగా వండని అన్నం తినడం మాత్రం చాలా ప్రమాదకరమని కొత్త అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. కొంతమంది తక్కువ నీటితో అన్నాన్ని ఉడికిస్తారు. సరిగా ఉడక్కుండా మెతుకులు గట్టిగా అవుతాయి. అయినా సరే ఆ అన్నాన్ని తినేస్తారు. అలాగే కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అన్నం పొడిగా వచ్చేందుకు వాటిని పూర్తిగా ఉడకనివ్వరు. ఇలాంటి సరిగా వండని అన్నాన్ని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంద. 

మనం తినే ఆహారాలన్నీ దాదాపు రసాయనాలతో మిళితమైనవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలకు చీడా పీడా పట్టకుండా క్రిమిసంహారక మందులు వాడుతూనే ఉన్నారు. ఆ మందులు మొక్కలపైనే కాదు, మట్టిపైన కూడా పడి, ఆ మట్టిలో రసాయనాలు కలిసిపోయాయి. ఇలా కొన్నేళ్ల నుంచి జరుగుతుంటే మట్టి నుంచి రసాయనాలు మొక్కల ద్వారా, పంట పై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇంగ్లాండ్ లోని క్వీన్స్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం మట్టిలోకి పరిశ్రమల వ్యర్థాల వల్ల చేరిన రసాయనాలు, పురుగుల మందుల నుంచి చేరిన రసాయనాలు కలిపి వరి పంటని ప్రమాదకరంగా మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఆర్సెనిక్ అనే విషతుల్యమైన రసాయనంగా మారుతుందని అధ్యయనం చెబుతోంది. 

కేవలం ఇదొక్క అధ్యయనమే కాదు పలు పరిశోధనలు అన్నం క్యాన్సర్ కారకమని పేర్కొంటున్నాయి. కాలిఫోర్నియా టీచర్స్ స్టడీ పేరుతో 90వ దశకంలో మరొక అధ్యయనం ప్రారంభించారు. వేల మంది ఈ అధ్యయనంలో భాగస్వాములయ్యారు. వారిలో 9,400 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వారిలో ఎక్కవ మందికి రొమ్ము క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. 

ఆర్సెనిక్ అంటే...
వివిధ ఖనిజాలలో ఉండే రసాయనం ఇది. పారిశ్రామిక పురుగుమందుల తయారీలో దీన్ని వాడుతారు. ఆహారం లేదా నీటి ద్వారా దీర్ఘకాలం ఆర్సెనిక్ ను మనం స్వీకరిస్తే అది విషంగా మారుతుంది. వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతో పాటూ క్యాన్సర్ కారకం అవుతుంది. అధ్యయనం ప్రకారం బియ్యం అధికస్థాయిలో ఆర్సెనిక్ ను కలిగి ఉంది. అందుకే బియ్యాన్ని బాగా ఉడికించి తినాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. 

ఎలా వండితే మంచిది?
1. ఒక కప్పు బియ్యానికి అయిదు కప్పుల నీటిని జోడించాలి. అన్నం బాగా ఉడికాక, అదనపు నీరుని వడకట్టేయాలి. ఇలా పూర్వకాలంలో వండేవారు. ఇలా వండితే ఆర్సెనిక్ స్థాయి సగానికి తగ్గిపోతుంది. 
2. బియ్యాన్ని కొన్ని గంటల పాటూ నానబెట్టి తరువాత వండితే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నాన బెట్టిన నీటిని బయట పడేయాలి. ఇలా చేస్తే 80 శాతం ఆర్సెనిక్ ప్రభావం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఆ పద్దతితో బియ్యం బాగా నానిపోతాయి, కనుక అన్నం ముద్దవుతుంది. 

Published at : 17 Sep 2021 07:39 AM (IST) Tags: health study Rice consumption Cancer Factors Cook well

సంబంధిత కథనాలు

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

టాప్ స్టోరీస్

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!