By: Haritha | Updated at : 29 Mar 2023 12:32 PM (IST)
(Image credit: Pexels)
బిర్యానీ నుంచి పన్నీర్ కర్రీ వరకు శాకాహార, మాంసాహార కూరలు, స్పెషల్ రైసులు... ఏవైనా సరే పైన కొత్తిమీరతో గార్నిషింగ్ చేస్తేనే పూర్తయినట్టు. కొత్తిమీర కేవలం రుచిని, వాసన కోసమే అనుకుంటారు. నిజానికి కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. రోజూ కొత్తిమీర తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దరి చేరవు. సాధారణ ఆకుకూరల్లో ఉండే ఎన్నో పోషక విలువలు వీటిలో నిండి ఉన్నాయి. అదనంగా ఇది రుచిని కూడా అందిస్తుంది.
1. కొత్తిమీరను రోజూ తినడం వల్ల ఆయుర్వేదంలో చెప్పే వాత, పిత్త, కఫ దోషాలను ఇది హరిస్తుంది.
2. పొట్ట సమస్యలకు ఇది చెక్ పెడుతుంది.
3. జీర్ణశక్తిని పెంచి ఆకలి కలిగించేలా చేస్తుంది. జఠర రసాలు ఉత్పత్తి చేసి జీర్ణ క్రియ సజావుగా సాగేలా సహాయపడుతుంది.
4. శరీరంలో చేరే విషపూరిత ఆహార పదార్థాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారిస్తుంది.
5. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికం. కాబట్టి దీన్ని తినడం వల్ల శరీరంలో వైరస్, బ్యాక్టీరియాల చర్యలను అడ్డుకోవచ్చు.
6. కొత్తిమీరలో విటమిన్ A, బి1, బి2 విటమిన్ C పుష్కలంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడే వారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.
7. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడే వారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర జ్యూసు తాగితే ఆ రోజంతా నోటి దుర్వాసన నుంచి కాపాడుకోవచ్చు.
8. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు కొత్తిమీర జ్యూస్‌తో ఆరోగ్యంగా మారచ్చు. ఇప్పుడు ప్రస్తుతం యువతలో హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య పెరుగుతుంది. ఆ సమస్య నుంచి కాపాడే గుణం కొత్తిమీరకు అధికం.
9. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను ప్రతిరోజు తినాలి. ఇది జీర్ణకోశంలో గ్యాస్‌ను ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి కాపాడుతుంది.
కిచెన్ గార్డెన్లో సులభంగా పెంచుకునే ఆకుకూర కొత్తిమీర. దీన్ని చిన్న కుండీలో సులువుగా పెంచుకోవచ్చు. ధనియాలను నలిపి మట్టిలో వేస్తే చాలు తాజా కొత్తిమీర వచ్చేస్తుంది. తాజా కొత్తి మీర వాడడం వంటకు మంచి రుచి, వాసన దక్కుతుంది. బయట అమ్మే కొత్తిమీరపై పెస్టిసైడ్స్ చల్లవచ్చు కాబట్టి వాటిని వాడే ముందు శుభ్రం కడుక్కోవాలి.
Also read: Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే
Also read: భోజనం చేశాక వెంటనే చేయకూడని పనులు ఇవే, లేకుంటే ఈ సమస్యలు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?
Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం
Thyroid Cancer: పదే పదే బాత్రూమ్కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు
మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!
ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?
Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్ టీం ఏర్పాటు
BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!