Lunar Eclipse 2025 : చంద్ర గ్రహణం చూడాలనుకుంటున్నారా? బ్లడ్ మూన్ చూసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Lunar Eclipse : బ్లడ్ మూన్ చూడాలనుకుంటున్నారా? అయితే చంద్రగ్రహణం సమయంలో దీనిని చూడాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Lunar Eclipse 2025 Blood Moon : సెప్టెంబర్ 7, 2025 రాత్రి 9 గంటల 58 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం (When is the Blood Moon 2025) ఏర్పడనుంది. ఇండియాలో కూడా దీని ప్రభావం ఉంది. అయితే ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ (Blood Moon) అంటారు. ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం, వాతావరణం అనుకూలంగా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85% మంది ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరట.
అలాగే ఈ చంద్ర గ్రహణం ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన గ్రహణం అని కూడా చెబుతున్నారు. దీనికంటే ముందు స్థానంలో 27 జూలై 2018న ఏర్పడిన సుదీర్ఘ చంద్రగ్రహణం గంట 43 నిమిషాల వ్యవధి ఉంది. దాని తర్వాత ఇదే సుదీర్ఘమైన గ్రహణంగా చెప్తున్నారు. మరి ఈ బ్లడ్ మూన్ గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.. గ్రహణం చూడాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తుంది
సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse) ఏర్పడినప్పుడు.. బ్లడ్ మూన్ కనిపిస్తుంది. భూమి పూర్తిగా సూర్యుడు, చంద్రుడి మధ్య వచ్చినప్పుడు.. దాని నీడ చంద్రుడిని కప్పేస్తుంది. ఆ సమయంలో చంద్రుడు నేరుగా సూర్యకాంతిని పొందలేడు. కానీ భూమిపై వాతావరణం గుండా వెళ్లే ఎరుపు రంగు కాంతి మాత్రం చంద్రుడిపై పడుతుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో(Why does the Moon turn red) లేదా రాగి రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్ అంటున్నారు. ఈ గ్రహణ సమయంలో అరుదైన ఖగోళ దృశ్యాన్ని మీరు సురక్షితంగా చూడవచ్చు. కళ్లకు ఎలాంటివి పెట్టుకోకపోయినా దీనిని చూడవచ్చు. ఈ బ్లడ్ మూన్ గంట 22 (How long will this eclipse last) నిమిషాల పాటు ఉండనుంది.
చంద్రగ్రహణం చూసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions while watching Lunar Eclipse)
సూర్యగ్రహణం అయితే నేరుగా చూడలేము కానీ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. దీనిని చూసేందుకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. నేరుగా కళ్లకు ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా చూడవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా సురక్షితం. కానీ జ్యోతిష్యం, మతపరమైన విధానాలు నమ్మేవారు గ్రహణం చూడరు. పైగా గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇండియాలో వీటిని నమ్మేవారు ఎక్కువ. ఇతర దేశాల్లో బ్లడ్ మూన్ చూసేందుకు ఆసక్తి చూపిస్తే.. ఇండియాలో మాత్రం కొన్ని అంశాలు తప్పక పాటిస్తారు. అవేంటంటే..
చంద్రగ్రహణం కళ్లకు ఎక్కువ హాని కలిగించకపోయినా టెలిస్కోప్‌ను ఉపయోగిస్తే మంచిదని భావిస్తారు. చిన్న పిల్లలను బ్లడ్ మూన్ చూసేందుకు ఒంటరిగా వదలకూడదని చెప్తారు. గట్టిగా మాట్లాడితే బయట తిరగడం కూడా నిషిద్దంగా చెప్తారు. జ్యోతిష్యం ప్రకారం.. గర్భిణులు చంద్రగ్రహణం చూడకూడదట. గ్రహణ సమయంలో ఆహారం, నీటిని తీసుకోకూడదట. అలాగే గ్రహణం తర్వాత స్నానం చేయాలని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. ABPLive, ABP Desam ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించట్లేదని గుర్తించాలి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















