అన్వేషించండి

Charger Safety Tips : రాత్రుళ్లు ఛార్జర్ ప్లగ్ ఇన్ చేసి వదిలేస్తున్నారా? అయితే జాగ్రత్త బిల్లుతో పాటు ఆ ప్రమాదాలు తప్పవు

Charger Safety Precautions : తొందరపాటులో లేదా అలవాటుగా చాలామంది ఫోన్ చార్జర్​ను నుంచి తీసేసి.. స్విచ్ ఆఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా వదిలేయడం వల్ల ఎంత నష్టమో తెలుసా?

Charger Plugged in Dangers : ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత చాలామంది ఫోన్​ను ఛార్జర్​ నుంచి తీసేసి.. సాకెట్‌లను అలానే వదిలేస్తారు. స్విచ్ ఆఫ్​ చేయకుండా సాకెట్​ అలా ఉంచే అలవాటు మీకు కూడా ఉందా? అయితే జాగ్రత్త. ఎందుకంటే చాలామంది తొందరపాటులో ఛార్జర్ నుంచి ఫోన్ తీసి స్విచ్ కూడా ఆఫ్ చేయరు. మరికొందరు బద్ధకంతో అలానే సాకేట్ ఉంచేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమీ కాదులే అని అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. ఛార్జర్‌ సాకేట్​ను ఉంచి స్విచ్ ఆన్​లో ఉంచడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయట. అవేంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.  

ఛార్జర్ స్విచ్ ఆఫ్ చేయడం ఎందుకు ముఖ్యం?

ఛార్జర్ సాకెట్‌లో ఉండి.. స్విచ్​ ఆన్‌లో ఉన్నప్పుడు విద్యుత్ వినియోగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఛార్జింగ్ కోసం ఫోన్ పెట్టినా లేదా పెట్టకున్నా పవర్ రన్ అవుతుందట. దీనివల్ల విద్యుత్తు వినియోగం వృధా అవుతుంది. దీనినే వాంపైర్ పవర్ లేదా ఫాంటమ్ లోడ్ అని కూడా అంటారు. ఈ అలవాటు విద్యుత్ బిల్లును పెంచడమే కాకుండా.. విద్యుత్ షాక్‌కు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎక్కువ పవర్ ఉన్న ఛార్జర్‌లను ఆన్‌లో ఉంచడం వల్ల కరెంట్ తగిలే ప్రమాదం ఉంది. ఛార్జర్‌లు లేదా ఇతర పరికరాలు నిరంతరం ప్లగ్ ఇన్ చేయడం వల్ల వేడెక్కుతాయి. దీనివల్ల వాటిలో షార్ట్ సర్క్యూట్ లేదా పేలుళ్లు జరుగుతాయి. కాబట్టి స్విచ్ ఆన్‌లో ఉంచే అలవాటును మార్చుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీరు కొద్దికొద్దిగా విద్యుత్తును ఆదా చేయగలుగుతారు. అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది.

గుర్తించుకోవాల్సిన విషయాలివే

ఛార్జర్‌ను ఎక్కువ కాలం ఉపయోగిస్తుంటే.. మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది మంచం లేదా సోఫాలో కూర్చుని కేబుల్‌ను లాగి ఛార్జర్‌ను తీయడానికి ప్రయత్నిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. అలాగే ఛార్జర్ ఒకేసారి లాగడం వల్ల కేబుల్ తెగిపోవచ్చు. కాబట్టి ఎప్పుడూ అడాప్టర్‌ను నెమ్మదిగా పట్టుకుని సాకెట్ నుంచి తీయాలి. ఛార్జర్‌ను ఎప్పుడూ తడి లేదా నీటి ఉపరితలంపై ఉంచకూడదు. ఛార్జర్ తడిస్తే వాటిని ఉపయోగించే ముందు బాగా ఆరబెట్టండి. రాత్రుళ్లు పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంచేయడం లేదా ఫోన్ రాత్రంతా ఛార్జర్లో ఉంచడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఫోన్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. లేదా పేలుళ్లు వంటి ప్రమాదాలు జరగవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Embed widget