Women's safety helpline India : ప్రతి మహిళ తమ ఫోన్లో కచ్చితంగా సేవ్ చేసుకోవాల్సిన నెంబర్లు ఇవే.. ఎమర్జెన్సీలో హెల్ప్ అవుతాయి
Safety tips for women : మహిళలు తమ ఫోన్లో ఎవరి నెంబర్స్ ఉన్నా లేకున్నా కొన్ని హెల్ప్‌లైన్ నెంబర్లు ఉంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ నెంబర్లు ఏంటో చూసేద్దాం.

Must-Know Emergency Numbers for Women : మహిళలపై జరిగే దాడులను కంట్రోల్ చేయడానికి, దాడుల్లో ఉన్న మహిళలకు సహాయం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని హెల్ప్ లైన్స్ అందుబాటులోకి తెచ్చాయి. ఆపదలో ఉంటే అయినవాళ్లకే కాల్ చేస్తామనుకుంటారు కానీ.. కొన్ని పరిస్థితుల్లో బ్యాలెన్స్ లేక సహాయం కూడా అందదు. అలాంటప్పుడు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు మీకు సహాయం అందిస్తాయి. అయితే ఆ నెంబర్లు గురించి కొందరికి సరైన అవగాహన ఉండదు. ప్రభుత్వం టోల్ ఫ్రీ ద్వారా సహాయం అందించే నెంబర్లు ఏంటి? అవి ఎలాంటి సేవలు అందిస్తాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
100 - పోలీస్ సహాయం కోసం
100 అనేది పోలీస్ అత్యవసర సేవలకు సంబంధించిన నెంబర్. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే.. సహాయం కోసం మీరు పోలీసులకు కాల్ చేయవచ్చు. క్రిమినల్ యాక్టివిటీ జరిగినప్పుడు లేదా జరుగుతున్నప్పుడు కూడా ఈ నెంబర్‌కి కాల్ చేయవచ్చు. మీరు ఏ లొకేషన్ నుంచి కాల్ చేస్తే మీ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెంటనే చేరుతుంది.
112-National Emergency Helpline
112 అనేది జాతీయ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్. ఈ నెంబర్ పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సర్వీస్‌లను అందిస్తుంది. అత్యవసర సేవలను త్వరగా యాక్సెస్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. పైగా ఈ నెంబర్‌ను ఈజీగా గుర్తించుకోవచ్చు. 112 ఇండియా పేరుతో మొబైల్ యాప్ కూడా ఉంది. ఇది ఎమర్జెన్సీ కాల్స్ చేయడంలో, సంకేతాలు పంపడంలో హెల్ప్ చేస్తుంది.
1091- ఉమెన్ హెల్ప్‌లైన్
మహిళలకు సేవలు అందించేందుకు 1091 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్. మహిళలపై వేధింపులకు గురైనప్పుడు, గృహ హింసతో ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎవరైనా వెంబడిస్తూ, బెదిరిస్తూ ఉన్నప్పుడు అత్యవసర సమయాల్లో ఈ కాల్కి ఫోన్ చేస్తే సహాయం అందుతుంది.
181 – Women’s Helpline
181- National Commission for Women (NCW) Helpline కూడా మహిళలపై జరిగే గృహ హింస, వేధింపులపై స్పందించి.. కౌన్సెలింగ్ అందిస్తుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో రెస్క్యూ చేస్తుంది. లీగర్, సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా కౌన్సెలింగ్ అందిస్తుంది. బాధితులకు షెల్టర్ ఇవ్వడం, వైద్య సహాయం అందించడం చేస్తారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్. 24x7 అందుబాటులో ఉంటుంది. మీ సమాచారాన్ని భద్రంగా ఉంచి.. సపోర్ట్ చేస్తారు.
1098 చైల్డ్ హెల్ప్ లైన్
చిన్నపిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు 1098 – Child Helpline నెంబర్‌కి కాల్ చేయవచ్చు. ఇది కేవలం చిన్నపిల్లలకే కాదు టీనేజ్ గర్ల్స్‌కి కూడా సహాయం అందిస్తుంది. ఇది కూడా టోల్ ఫ్రీ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్. CHILDLINE India Foundation పార్టనర్షిప్తో Ministry of Women and Child Development దీనిని నిర్వహిస్తుంది. ఫిజికల్‌గా, లైంగికంగా, ఎమోషనల్‌గా పిల్లలపై దాడి జరిగినప్పుడు దీనికి కాల్ చేయవచ్చు. చైల్డ్ లేబర్, బాల్య వివాహం, పిల్లలు కనిపించకపోయినప్పుడు కూడా ఈ నెంబర్‌కి కాల్ చేయవచ్చు.
108 – Ambulance Services
మెడికల్ సర్వీస్ కావాలనుకున్నప్పుడు 108 నెంబర్‌కి కాల్ చేయవచ్చు. యాక్సిడెంట్లు, దాడి, ప్రమాదాల సమయంలో ఈ నెంబర్‌కి కాల్ చేస్తే తక్కువ సమయంలోనే వైద్య సహాయం అందుతుంది.
1090 – Cyber Crime Helpline
ఇది సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇది మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఆన్లైన్ వేధింపులు, ఆన్లైన్ abuse, బ్లాక్మెయిల్ వంటి కంప్లైట్స్ ఇక్కడ ఇవ్వొచ్చు. 1930 – Financial/Cyber Fraud Helpline కూడా UPI లేదా ATM స్కామ్‌లు, ఆదాయపరంగా జరిగే ఫ్రాడ్లపై వర్క్ చేస్తుంది.
మహిళలు ఈ నెంబర్స్‌ని క్విక్ యాక్సెస్‌లో ఉంచుకుంటే మంచిది. ఇవే కాకుండా జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేఫ్టీ యాప్స్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి మీరు ఎమర్జెనీలో ఉన్నప్పుడు బాగా హెల్ప్ అవుతాయి.






















