Love At First Sight: తొలిచూపులోనే ప్రేమ... అదొక ఎమోషనల్ ఫీలింగ్... పరిశోధనలో ఆసక్తికర విషయాలు
తొలిచూపులోనే ప్రేమ పుట్టిందంటారు అది మీరు వినే ఉంటారు. అయితే ఇది వాస్తవమేనా అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. తొలిచూపు ప్రేమపై పరిశోధన చేశారు.

మీరు ఎప్పుడైనా తొలిచూపులోనే ప్రేమలో పడ్డారా... లేదా మీ స్నేహితుడో, మరెవ్వరైనా తొలిచూపులోనే ప్రేమలో పడ్డానని చెప్పడం మీరు వినే ఉంటారు. అయితే ఈ తొలిచూపు ప్రేమలో కలిగే విషయాలు ఎలా ఉంటాయో తెలుసా. తొలిచూపులోనే ప్రేమించేశా అంటారు కానీ ఎలా సాధ్యం. అయితే దీని వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయంటున్నారు పరిశోధకులు. తొలిచూపు ప్రేమికుల మాటలు, వారి చర్యలు, మనోభావాలు, మొదటిసారి కలిసిన వెంటనే కలిగే అనుభూతి వీటన్నింటికీ ఓ రీజన్ ఉందంటున్నారు. ఏ వ్యక్తి అయినా తొలి చూపులోనే ఎందుకు ప్రేమలో పడతాడో దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని తెలుసుకుందాం. దీని వెనుక సైంటిఫిక్ రీజన్‌తో పాటు ఎమోషనల్ రీజన్స్ కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అందుకే తెలియని వ్యక్తి అయినా తొలిచూపులోనే హృదయానికి అతుక్కుపోతారు అంటున్నారు.
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు
స్టడీ ఆన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో చాలా మందిని బ్లైండ్ డేట్‌కు వెళ్లమని అడిగారు. తొలి భేటీ తర్వాత కొందరి మధ్య కెమిస్ట్రీ ఎలా డెవలప్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. వారిలో కనిపించిన లక్షణాలపై అధ్యయనం చేశారు. దీనిలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇది ఒక మానసిక ప్రక్రియ అని పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రక్రియ శారీరక లక్షణాలతో ప్రారంభమవుతుంది. ఇందులో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. ఇద్దరి హార్ట్ బీట్‌లు ఒకే ట్యూన్‌లో ప్లే కావడం. ఈ పరిశోధనలో 18 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల 142 మందిని బ్లైండ్ డేట్‌కు పంపి అధ్యయనం చేశారు. ఈ సమయంలో డేటింగ్ క్యాబిన్‌లో కంటి-ట్రాకింగ్ గ్లాసెస్, హృదయ స్పందన మానిటర్లు, స్వెట్ ఎగ్జామినర్స్ అమర్చారు.
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
అరచేతిలో చెమట
వీరిలో మొదటి చూపులోనే ప్రేమను పుట్టిన 17 జంటలను గుర్తించారు. ఈ జంటల గుండె చప్పుడు ఒకే విధంగా ఉంది. శాస్త్రవేత్తలు దీనికి ఫిజియోలాజికల్ సింక్రోనీ అని పేరు పెట్టారు. ఇందులో వీరంతా ఒక రకమైన అపస్మారక స్థితిలో ప్రవర్తించారని తెలిపారు. ఆ టైంలో వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియదు. మొదటి చూపులో ఎవరైనా ప్రేమలో పడినప్పుడు, అరచేతుల్లో కొంచెం చెమట పడుతుంది. ఈ అధ్యయన నివేదికను నేచర్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురించారు.
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















