Liver-Friendly Foods : కాలేయాన్ని కాపాడుకోవడానికి తినాల్సిన ఫుడ్స్ ఇవే.. వెల్లుల్లి నుంచి కాఫీ వరకు, కారణాలివే
Liver Health : కాలేయ సమస్యలను దూరం చేసుకోవడానికి.. లివర్ ఫ్యాట్ పెరగకుండా ఉండేందుకు కొన్ని ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో.. వాటి వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.

Foods for Liver Health : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా డైట్‌ని సెట్ చేసుకోవాలి. కాలేయ సమస్యలను దూరం చేసుకోవడానికి కూడా కొన్ని ఫుడ్స్ రొటీన్‌గా తీసుకోవాలి. లివర్ హెల్త్ కోసం ఆల్కహాల్ మానేయడం, స్మోకింగ్ వదిలేయడం, వ్యాయామం రెగ్యులర్‌గా చేయడంతో పాటు కొన్ని ఫుడ్స్ రోజూ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? లివర్ ఫ్యాట్‌ని తగ్గించి.. కాలేయ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి
వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా లివర్ హెల్త్‌కి. ఎందుకంటే వెల్లుల్లిలో అల్లిసిన్, సెలీనియం ఉంటాయి. ఇవి కాలేయాన్ని డీటాక్స్ చేసి.. టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా డైట్లో తీసుకోవచ్చు.
ఆకు కూరలు
కాలేయ ఆరోగ్యం కోసం ఆకు కూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పాలకూర, కాలే, మెంతికూర వంటి ఆకు కూరల్లో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది.
పసుపు
వంటింట్లో ఉండే పసుపు పూర్తి ఆరోగ్యంతో పాటు కాలేయాన్ని కాపాడుకోవడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిలోని కర్క్యుమిన్ లివర్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కాలేయ కణాలను మెరుగుపరుస్తుంది.
దుంపలు
బీట్రూట్, క్యారెట్ వంటి దుంపల్లో ఫ్లేవనాయిడ్స్, బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ ఫంక్షన్‌ని మెరుగుపరచడమే కాకుండా.. రక్తాన్ని శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీనివల్ల లివర్‌పై భారం తగ్గుతుంది.
ఒమేగా 3
కాలేయాన్ని కాపాడుకోవడం కోసం ఒమేగా 3 ఫ్యాట్స్ పుష్కలంగా చేపలు తీసుకుంటే మంచిద. ఇవి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి.. లివర్ హెల్త్‌ని మెరుగుపరుస్తాయి. అలాగే వాల్ నట్స్ కూడా లివర్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ ఫంక్షన్‌ని మెరుగుపరిచి.. కాలేయంలో కొవ్వు చేరకుండా కాపాడుతాయి. కాబట్టి దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది.
హెల్తీ ఫ్యాట్స్
అవకాడోల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. గ్లూటాథిన్ కూడా ఉంటుంది. ఇది లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అలాగే డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్లో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి లివర్ ఫ్యాట్ పెరగకుండా హెల్ప్ చేస్తాయి.
బెర్రీలు
యాంటీఆక్సిడెంట్లు బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. బ్లూ బెర్రీలు, క్రాన్బెర్రీ, స్ట్రాబెర్రీలను డైట్లో తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. లివర్ హెల్త్‌కి మేలు జరుగుతుంది.
ఇవేకాకుండా యాపిల్స్, సిట్రస్ ఫ్రూట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ఫుడ్స్ కూడా లివర్ హెల్త్‌ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. కాఫీ కూడా లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. కానీ తక్కువ మోతాదులో బ్లాక్ కాఫీ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యుల సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.






















