చూసేందుకు చిన్నగా, ఈతకాయల మాదిరిగా కనిపించే ఈ పండు పేరు సీ బక్త్రాన్.

దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు.

సీ బక్త్రాన్​ పండులో విటమిన్ సి, ఈ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరధక శక్తిని పెంచుతాయి.

వీటిలో ఒమేగా ఫ్యాటీ 3,6,7,9 యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

స్కిన్​ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పింపుల్స్ తగ్గుతాయి.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు అల్సర్స్ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

సీ బక్​త్రాన్ ఫ్రూట్​లు లివర్​ హెల్త్​కి మేలు చేస్తాయి. జీర్ణ సమస్యలు తగ్గిస్తాయి.

దీనిలో బీటాకెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. దృష్టిని పెంచుతాయి.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం సీ బక్​త్రాన్ ఫ్రూట్ తింటే బరువు తగ్గుతారట.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.