వర్షాకాలంలో నీరు పంటకు సమృద్ధిగా అందుతుంది. కానీ చాలామంది రైతులు ఎక్కువ నష్టపోతారు.

అందుకే వర్షాకాలంలో పంట దెబ్బతినకుండా కాపాడుకునేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ చూసేద్దాం.

పంట మధ్యలో సరైన డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. దీనివల్ల పంట నీట మునగదు.

వర్షాకాలానికి తట్టుకోగలిగే పంటలను వేసుకుంటే మంచిది. ఈజీగా పాడైపోయే వాటికి దూరంగా ఉండాలి.

మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడానికి విత్తే ముందు నేలను పరీక్షించాలి.

వర్షాల కారణంగా ఎరువులు ఎక్కువగా వాడకుండా నేలను బట్టి ఎరువులు వాడాలి.

వర్షాకాలంలో శిలీంధ్ర వ్యాధులు నివారించడానికి బయో ఏజెంట్ ట్రీట్​మెంట్ ఇవ్వొచ్చు.

వరి, మొక్కజొన్న, సోయాబీన్, సజ్జలు, మినుములు, పల్లీ వంటివి వర్షాన్ని తట్టుకుంటాయి.

వాతావరణానికి, ప్రాంతానికి సరిపోలే వైరెటీలు ఎంచుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వీటిని ఫాలో అయితే పంటనష్టం జరగకుండా కాపాడవచ్చు.