ఉల్లిపాయ కట్ చేశాక చేతులకు పట్టిన వాసనను ఇలా వదిలించుకోండి

ఉల్లిపాయలు కట్ చేస్తే కంటి నుంచి నీళ్లు వస్తాయి. ఇది తెలిసిన విషయమే.

అయితే కట్ చేసినప్పుడు చేతులకు అంటిన వాసన కూడా అంత సులువుగా వదలదు.

ఈ వాసనకు కారణం ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలే.

ఈ వాసనను పొగొట్టుకోవడానికి కొన్ని ఇంటి నివారణలు ఫాలో అయితే మంచిది.

ఉప్పుతో కలిపి చేతులు కడుక్కుంటే ఉల్లిపాయ వాసన తగ్గుతుంది.

చేతులను తడిపి దానిపై ఉప్పును అప్లై చేయాలి. దీనివల్ల దుర్వాసన పోతుంది.

టూత్ పేస్ట్, మోత్​వాష్​తో కూడా చేతులను కడగవచ్చు. ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

చేతులపై నిమ్మరసం అప్లై చేయడం వల్ల ఉల్లివాసన తగ్గుతుంది.

కాఫీపొడి కూడా ఉల్లిపాయ వాసనను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది.