అంజీర్​ను డ్రైగానే కాదు పండుగా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయట.

దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని, ఇతర జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది.



అంజీర్​ స్వీట్​గా ఉన్నా దానిలో గ్లైసమిక్ ఇండెక్స్​ని కంట్రోల్ చేసే లక్షణాలు ఉంటాయి. ఇవి బ్లడ్​ షుగర్​ని తగ్గిస్తాయి.



అంజీర్​లో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపిని తగ్గిస్తాయి.



అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్​ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.



బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు.



దీనిలో ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి ఆహారం తీసుకోవడం తగ్గించేలా చేస్తుంది.



అంజీర్​లో విటమిన్ ఏ, సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.



అంజీర్​లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్​ నుంచి చర్మాన్ని కాపాడి హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి.



ఇవే కాకుండా అంజీర్​ నేరుగా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.



ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.