వర్షాకాలంలో వాటర్​ఫాల్స్ చూసేందుకు చాలా బాగుంటాయి. వర్షాల వల్ల నీరు నిండుగా ఉంటుంది.

అందుకే చాలామంది ఈ సమయంలో వాటర్​ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

మీరు వాటర్​ఫాల్స్ దగ్గరికి వెళ్లాలనుకుంటే వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

వాటర్​ఫాల్స్ దగ్గర కాళ్లు జారకుండా ఉండేందుకు ట్రెక్కింగ్ షూలు, చెప్పులు వేసుకుంటే మంచిది.

జారిపోయే ఎడ్జ్​ల దగ్గర నిల్చొక పోవడమే మంచిది. ఫోటోల కోసం రిస్క్​లు చేయాల్సిన అవసరం లేదు.

మీరు వెళ్లే ప్రాంతాల్లో ఆఫీసర్స్ ఇచ్చే సూచనలు, వారు చెప్పే టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి.

వాటర్​ప్రూఫ్ బ్యాగ్, ఫోన్ కవర్​, ఇతర ఇంపార్టెంట్ వస్తువులు ఉంచేందుకు వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ తీసుకెళ్లాలి.

అలాగే నీటిలో తడుస్తారు కాబట్టి సపరేట్ దుస్తులు, టవల్, ఫస్ట్ ఎయిడ్ కిట్​ని తీసుకుపోవాలి.

తడిగా ఉండే రాళ్లను ఎక్కకపోవడమే మంచిది. ప్రమాదావశాత్తు స్లిప్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది.

వాటర్​ఫాల్ వంటి ప్రదేశాలకు ఒంటరిగా కాకుండా గ్రూప్​గా వెళ్తేనే మంచిది.