చికెన్ చపాతీ కోసం చికెన్​లో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలిపి అరగంట పక్కన పెట్టాలి.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి మీడియం మంట పెట్టాలి. దానిలో మెరీనేట్ చేసిన చికెన్ వేయాలి.

చికెన్​ కాస్త రంగు మారేవరకు కలుపుతూ చికెన్​ను పూర్తిగా ఉడకనివ్వాలి.

చికెన్​ పూర్తిగా ఉడికిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, కాప్సికమ్ వేసి కాస్త ఉడికనివ్వాలి.

దానిలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత కాస్త నిమ్మరసం వేసి కలపాలి.

ఇప్పుడు చపాతీని తయారు చేసుకుని దానిని నెయ్యితో కాల్చుకోవాలి.

ఇప్పుడు చపాతీలపై ముందుగా తయారు చేసుకున్న చికెన్​ని వేసుకోవాలి.

దీనిని మీరు గ్రీన్ చట్నీ లేదా మయోనైస్ లేదా టొమాటో కెచప్​తో లేయర్ చేసుకోవాలి.

ఇప్పుడు దీనిని రోల్ చేసుకోవాలి. మీకు నచ్చిన టిష్యూ లేదా సిల్వర్ ఫాయిల్​తో చుట్టుకోవాలి.

అంతే టేస్టీ టేస్టీ చికెన్ రోల్ రెడీ. దీనిని మీరు లంచ్​ బాక్స్​కి తీసుకెళ్లవచ్చు.