డయాబెటిస్ సమస్యలున్నవారు కొన్ని వాటికి కచ్చితంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.

ముఖ్యంగా ఆల్కహాల్​కి దూరంగా ఉండాలంటున్నారు. ఇది ఆరోగ్యానికి ప్రాణాంతకమవుతుందని చెప్తున్నారు.

ఆల్కహాల్​ రక్తంలో షుగర్​ లెవెల్స్​ని పెంచడం లేదా తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుందని చెప్తున్నారు.

మందు తాగిన తర్వాత రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. నిద్రలో కూడా సమస్యలుంటాయి.

ఆల్కహాల్ లివర్​పై నెగిటివ్​గా ప్రభావితం చేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది కలిగిస్తుంది.

మధుమేహం కోసం తీసుకునే మెడిసన్ ఆల్కహాల్​పై నెగిటివ్​ ప్రభావం చూపిస్తుందట.

కాక్​టైల్స్, బీర్, స్వీట్ వైన్స్​లో షుగర్స్, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి షుగర్​ని స్పైక్స్​ చేస్తాయి.

డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది. ఇది మధుమేహమున్నవారికి ఇబ్బందిని కలిగిస్తుంది.

మందు తాగినప్పుడు సరిగ్గా తినకపోయినా.. మెడిసన్స్ తీసుకోకపోయినా తీవ్ర పరిణామాలు కలిగిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.