రోజూ నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు.

డయాబెటిస్ ఉన్నవారు కూడా రోజూ నేరేడు పండ్లు తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

వీటిని తినడం వల్ల గ్లైసమిక్ ఇండెక్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి.

నేరేడు పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

వీటిలో డైటర్ ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

నేరేడు పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది.

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు పింపుల్స్​ని దూరం చేస్తాయి. జిడ్డును తగ్గిస్తాయి. స్కిన్​ టోన్​ని మెరుగుపరుస్తాయి.

నేరేడు పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఓరల్ హెల్త్​కి మేలు చేస్తాయి. నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.