చపాతీలు మెత్తగా, పొరలుగా వస్తే తినడానికి చాలా బాగుంటాయి. పైగా త్వరగా గట్టిపడవు.

మీరు కూడా అలా చపాతీలు చేయాలనుకుని ఫైయిల్ అయ్యారా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

ముందుగా గోధుమ పిండిని గిన్నెలోకి తీసుకుని కాస్త ఉప్పు నీళ్లు వేసి కలుపుకోవాలి.

పిండిని కాస్త బంకంగానే ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఆ పిండిని చపాతీకి కావాల్సిన సైజులో తీసుకుని పిండి వేస్తూ గుండ్రంగా ఒత్తుకోవాలి.

ఇలా ఒత్తిన చపాతీపై నూనెను రాయాలి. పూర్తిగా నూనె రాసి దానిని రెండుసార్లు మడవాలి.

ఇలా మూసిన చపాతీ చివర్లను కూడా కలిపి.. లైట్​గా పిండి వేస్తూ మళ్లీ చపాతీలుగా ఒత్తుకోవాలి.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కాస్త నూనె రాసి.. ఈ చపాతీను వేసి దోరగా కాల్చుకోవాలి.

చపాతీపై కాస్త నూనె రాసి రెండువైపులా వేయించుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే చపాతీలు చేసుకోవచ్చు.

పొరలు పొరలుగా, మెత్తగా చపాతీలు రెడీ అయిపోతాయి. ఇవి ఎక్కువసేపు గట్టిపడకుండా ఉంటాయి.

ఫ్రిడ్జ్​లో పెట్టుకున్నా కూడా ఇలా చేస్తే గట్టిపడవు. పాలు కలపము కాబట్టి పాడవకుండా ఉంటాయి.