తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఆరోగ్యానికి నష్టమని చెప్తున్నారు నిపుణులు.

రోజు ఎంత సాల్ట్ తీసుకోవాలి? ఎక్కువ ఉప్పు తింటే కలిగే ఇబ్బందులు ఏంటో చూసేద్దాం.

సాల్ట్​ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీటిని రిటైన్ చేస్తుంది. ఇది బీపీని పెంచుతుంది.

ఉప్పు మోతాదుకి మించి తీసుకుంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు పెరుగుతాయి.

సోడియం లెవెల్స్ పెరగడం వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. కిడ్నీలో రాళ్లు రావడం వంటివి జరుగుతాయి.

శరీరంలో నీటిని ఎక్కువ నిల్వ ఉంచుతుంది. దీనివల్ల ఉబ్బరం, వాపు, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి.

ఉప్పులోని ఎక్కువగా తినడం వల్ల యూరిన్ ద్వారా కాల్షియం శరీరం కోల్పోతుంది. ఇది బోన్స్ హెల్త్​ని నాశనం చేస్తుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక సమస్యలు పెరుగుతాయి. క్యాన్సర్​కి దారితీస్తుంది.

డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతాయి. దాహం, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సాల్ట్ తీసుకుంటే మంచిదట.