పసుపు స్కిన్​ టోన్​ని మెరుగపరిచి మీ అందాన్ని రెట్టింపు చేయడంలో హెల్ప్ చేస్తుందని అందరికీ తెలుసు.

అయితే పసుపును ఏ రకంగా ముఖానికి అప్లై చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపులో పెరుగు, తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే స్కిన్ మంచి గ్లో వస్తుంది. వారానికి రెండు, మూడుసార్లు దీనిని ట్రై చేయవచ్చు.

ఈ మాస్క్​ని 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకొని.. గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

మీకు ఆయిల్ స్కిన్ ఉంటే.. పసుపులో శనగపిండి, పాలు వేసి ఫేస్ మాస్క్​గా అప్లై చేసుకోవచ్చు.

దీనిని వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవచ్చు. మాస్క్ ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

పసుపులో అలొవెరా జెల్ కలిపి మాస్క్​గా అప్లై చేసుకుంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్లకి మంచిది.

ఈ మాస్క్​ను 10 నుంచి 15 నిమిషాలు ఉంచి.. చల్లని నీటితో కడిగితే మంచి ఫలితాలు ఉంటాయి.

ముఖానికి ఏది అప్లై చేసినా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.