పిల్లలకు డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్​గా పెడితో ఆరోగ్యానికి మంచిదట. ఏవి పెడితే ఎలాంటి లాభాలో ఉంటాయో చూసేద్దాం.

బాదం తినిపించడం వల్ల పిల్లలకు బ్రైయిన్ డెవలప్మెంట్ అవుతుంది. విటమిన్ ఈ, మెగ్నీషియం అందుతాయి.

వాల్​నట్స్​లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

ఎండుద్రాక్షలు ఎనిమియాను దూరం చేస్తాయి. ఐరన్ సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

ఖర్జూరాలు స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎనర్జీని ఇస్తుంది.

అంజీర్​ పిల్లల్లో జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది. కాల్షియం బోన్స్ హెల్త్​కి హెల్ప్ చేస్తుంది.

జీడిపప్పులు శక్తిని అందిస్తాయి. మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అందుతాయి.

పిస్తాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ప్రోటీన్, ఫైబర్ దీనిలో పుష్కలంగా ఉంటుంది.

పిల్లలు రెండేళ్ల కంటే తక్కువగా ఉంటే వారికి డ్రై ఫ్రూట్స్ నేరుగా కాకుండా ఉడికించి, పౌడర్ చేసి పెట్టాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.