కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.

కొబ్బరి నీళ్లలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ ఉంటాయి.

ఇవేకాకుండా జింక్, భాస్వరం, విటమిన్ సి, బి, అమైనో యాసిడ్స్, ఫైబర్, కాల్షియం ఉంటాయి.

అయితే మరి వీటిని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? నిపుణులు చెప్పేది ఏమిటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీళ్లు తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటుందట.

ఇది చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి హైడ్రేషన్ అందుతాయి.

దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

ఇవి కేవలం అవగాహన మాత్రమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.