మీరు ఏ భోజనం చేసిన తర్వాత అయినా కీరదోస తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ?

కీరదోసలో నీటి శాతం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

శరీరంలోని వేడిని తగ్గించి స్పైస్ లెవెల్స్​ తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

భోజనం తర్వాత కీరదోస తింటే శరీరం హైడ్రేటెడ్​గా ఉంటుంది. తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది.

శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్​కి మంచిది.

కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.

రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. బ్యాలెన్స్ డైట్​లో భాగంగా దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు.

భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెష్ కోసం చూడకుండా కీరా తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు క్లియర్, మెరిసే చర్మాన్ని అందిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని డైట్​లో చేర్చుకోవాలి.