Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు ఇవే.. లక్షణాలు, నివారణ చిట్కాలు
Kidney Stones Causes : కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు ఏంటి? ఒకవేళ ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

Kidney Stone Prevention Tips : కిడ్నీలో రాళ్లు రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. కానీ ఇవి ఉంటే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కిడ్నీలోని రాళ్లను తొలగించడానికి వైద్యసహాయంతో పాటు కొన్ని ఆరోగ్య చిట్కాలు కూడా ఫాలో అవ్వాలి. అసలు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు ఏంటి? లక్షణాలు ఏంటి? ఆ సమస్యను ఎలా నివారించాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు రావడానికి లైఫ్‌స్టైల్‌తో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయి. ఇంతకీ ఆ కారణాలు ఏంటో చూసేద్దాం.
హైడ్రేషన్
శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు, శరీరానికి తగినంత నీరు అందనప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే నీరు శరీరానికి అందనప్పుడు మూత్రంలో ఉన్న ఖనిజాలన్నీ ఒకచోట చేరి రాళ్లుగా మారుతాయి.
ఉప్పు
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ప్రోటీన్ కోసం తీసుకునే మాంసాహారం మూత్రంలో కాల్షియం స్థాయిలు పెంచుతుంది. ఇవి స్టోన్స్‌ని పెంచి కిడ్నీల్లో ఏర్పడతాయి.
ఫ్యామిలీ
మీ కుటుంబంలో ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఉంటే.. మీరు కూడా రిస్క్‌లో ఉన్నట్టే. ఎందుకంటే ఇవి జన్యుపరంగా వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు.
ఫుడ్స్
పాలకూర, బీట్రూట్, చాక్లెట్, గోధుమ బ్రెడ్ వంటివి ఆక్సలేట్ ఫుడ్స్‌ని తగ్గించాలి. ఎందుకంటే ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి.
వ్యాయామం
అధికబరువు, సరైన జీవనశైలి ఫాలో అవ్వని వారికి కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు. వ్యాయామం వల్ల ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటు కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇవే కాకుండా హైపర్ పేరా థైరాయిడిజం, యూరిక్ యాసిడ్ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా కిడ్నీలో రాళ్లకు దారితీస్తాయి.
కిడ్నీలో రాళ్లు ఉంటే కలిగే ఇబ్బందులు
కిడ్నీలో రాళ్లు ఉంటే నడుము నొప్పి తీవ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి ఉంటుంది. మూత్రంలో రక్తం కనిపిస్తుంది. మూత్రం చిక్కగా మారడం వంటి సమస్యలు ఉంటాయి. బాడీ పెయిన్స్, జ్వరం, ఉలిక్కిపడడం, వాంతులు, మూత్రం ఆగిపోవడం, యూరిన్ పసుపు రంగులో రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని పట్టించుకోకపోతే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది.
కిడ్నీలో రాళ్లు.. నివారణ చిట్కాలు
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తిస్తే నివారణకోసం వైద్యుల సహాయం తీసుకోవాలి. అలాగే కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. ఉప్పు, స్వీట్స్, ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించాలి. ఆక్సలేట్ ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి.





















