అన్వేషించండి

Diabetes Control Tips : మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన 10 టిప్స్.. సహజంగా తగ్గించుకోండిలా

Manage Blood Sugar : డయాబెటిస్​తో ఇబ్బంది పడేవారు దానిని కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

Healthy Lifestyle for Diabetics : మధుమేహం ఈ రోజుల్లో వయసుతో తేడా లేకుండా అందరినీ ఎటాక్ చేస్తుంది. జన్యుపరంగా కొందరు డయాబెటిస్​తో ఇబ్బంది పడుతుంటే.. లైఫ్​స్టైల్​లో మార్పుల కారణంగా ఎక్కువమంది టైప్​ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ సమస్య వస్తే జీవితాంతం దానిని కంట్రోల్ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని సహజంగా తగ్గించుకోవడానికి లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు నిపుణలు. ఇవి మధుమేహాన్ని తగ్గించడమే కాకుండా.. రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి. 

వ్యాయామం

మీకు మధుమేహం ఉన్నా.. రాకుండా ఉండాలన్నా రెగ్యులర్​గా వ్యాయామం చేస్తూ ఉండాలి. వ్యాయామం కుదరకుంటే వాకింగ్, సైక్లింగ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవి శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. 

బరువు

మధుమేహముంటే.. లేదా మధుమేహం రాకుండా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు అదుపులో ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు మంచి డైట్​, రెగ్యులర్​ వ్యాయామం చేస్తూ ఉండాలి. 

ప్రాసెస్ చేసిన పుడ్ 

షుగర్​తో నిండి ఫుడ్స్, రిఫైండ్ ఫుడ్స్, అన్​హెల్తీ ఫ్యాట్స్​తో నిండి ఉండే ప్రాసెస్ ఫుడ్​కి దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అంతేకాకుండా వీటిని తినేకొద్ది తినాలనిపిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు పెంచడంతో పాటు గ్లూకోజ్ లెవెల్స్​ని పెంచి మధుమేహాన్ని రెట్టింపు చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. 

ఫైబర్ ఫుడ్స్

ప్రాసెస్ ఫుడ్స్​కి డయాబెటిస్ పేషెంట్లు ఎంత దూరంగా ఉండాలో.. ఫైబర్​ ఫుడ్​కి అంత దగ్గరగా ఉండాలి. ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందించి.. షుగర్ స్పైక్స్​ని కంట్రోల్ చేస్తుంది. పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు గట్ హెల్త్​ని మెరుగుపరిచి.. డయాబెటిస్​ను అదుపులో ఉంచుతాయి. 

హైడ్రేషన్

తరచూగా శరీరానికి నీటిని అందించాలి. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ మెరుగై.. శరీరంలోని టాక్సిన్లను, పెరిగిన గ్లూకోజ్​లను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అలాగే హైడ్రేటెడ్​గా ఉండడంవల్ల డీహైడ్రేషన్ సమస్యలు రావు. డీహైడ్రేషన్ మధుమేహాన్ని రెట్టింపు చేస్తుందని గుర్తించుకోవాలి. 

ఒత్తిడి 

ఒత్తిడి కూడా మధుమేహాన్ని పెంచుతుంది. డయాబెటిస్ రావడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ పెరుగుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. 

స్మోకింగ్

స్మోకింగ్ డయాబెటిస్ సమస్యలను రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండి హృదయ సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. న్యూరో సమస్యలు కూడా రావొచ్చు. స్మోకింగ్ మానేస్తే రక్త ప్రసరణ పెరిగి.. మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ మానేయండి.

నిద్ర

రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. సరైన నిద్ర లేకుంటే డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిద్ర నాణ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి. మంచి నిద్రవల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి మెరుగైన నిద్ర అవసరమని గుర్తించుకోండి. 

ఆల్కహాల్.. 

మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్​కు దూరంగా ఉండాలి. ఇది లివర్​ హెల్త్​ని కరాబ్ చేస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉండాలంటే ఆల్కహాల్​కి దూరంగా ఉండాలి. ఇది పూర్తి ఆరోగ్యానికి మంచిది. 

మెడిసన్

మధుమేహం ఉంటే వైద్యులు కచ్చితంగా కొన్ని మందులు సూచిస్తారు. వాటిని రెగ్యులర్​గా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పరిస్థితి కంట్రోల్ ఉంటుంది. అలాగే రెగ్యులర్​గా హెల్త్ చెకప్​లు చేయించుకుంటే మంచిది. 

ఇవే కాకుండా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మరచిపోకండి. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా.. కంట్రోల్​లో ఉంటాయి. ఈ లైఫ్​స్టైల్​ని మెయింటైన్ చేస్తూ ఉంటే మధుమేహం తగ్గుతుంది. అంతేకాకుండా మధుమేహం రాకూడదనుకునేవారు కూడా వీటిని ఫాలో అయితే డయాబెటిస్​ను దూరం చేసుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Razor Movie: 'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్‌ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్
'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్‌ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్
ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీల్లో NMC, LFP పేర్లు వింటున్నారా? వీటి మధ్య తేడాలేంటి?
EV బ్యాటరీలో అసలు మ్యాటర్‌ ఏంటి? మిక్సింగ్‌ మారితే పెర్ఫార్మెన్స్‌ ఎలా మారుతుంది?
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
Embed widget