అన్వేషించండి

Millets Kichidi: మధుమేహులకు బెస్ట్ ఫుడ్ కొర్రల కిచిడీ, వారానికోసారి తిన్నా ఎంతో ఆరోగ్యం

మధుమేహులు ఏం తినాలన్న భయపడాల్సిన పరిస్థితి. అందుకే వారికి ఈ టేస్టీ కొర్రల కిచిడీ రెసిపీ.

డయాబెటిస్ ఒక్కసారి ఒంట్లోకి ఎంట్రీ ఇచ్చిందో, మళ్లీ బయటికి వెళ్లడం చాలా కష్టం. ఈ దీర్ఘకాలిక వ్యాధిని తట్టుకోవాలంటే ఆహారపరంగా కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటూ, మరికొన్ని ప్రత్యేకంగా తినాల్సి ఉంటుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటకాలు, రాగిజావ వంటివి వారికి చాలా మేలు చేస్తాయి. మిల్లెట్లలో కొర్రలు డయాబెటిక్ రోగులకు చాలా మంచివి. సాధారణ అన్నంతో పోలిస్తే వీటి రుచి అంతగా బాగోదు. అయినా తినాల్సిందే. కాస్త రుచిగా వీటితో కొన్ని వంటకాలు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో కొర్రల కిచిడీ ఒకటి. 

కావాల్సిన పదార్థాలు
కొర్కరలు - ఒక కప్పు
పెసరపప్పు - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
క్యారెట్లు - రెండు
బంగాళాదుంప - ఒకటి
బీన్స్ - అయిదు
టమాటా - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఉప్పు - తగినంత
నూనె - సరిపడినంత

తయారీ ఇలా
1. కొర్రలను నాలుగ్గంటల ముందుగానే నీళ్లలో నానబెట్టాలి. 
2. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళాదుంపలు, బీన్స్, టమాటా ముక్కలు కోసి పెట్టుకోవాలి. వీటిలో ఉల్లిపాయలు నిలువుగా కోసుకోవాలి. 
3. కుక్కర్లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
4. అవి వేగాక క్యారెట్, బంగాళాదుంపలు, బీన్స్ ముక్కలు వేసి వేయించాలి. 
5. అవి వేగాక టమోటా ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా చేర్చాలి. 
6. బాగా వేగాక నీరు వేయాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న కొర్రలను వేయాలి. సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. 
7. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కొర్రల కిచిడి సిద్ధం.  
8. తినేముందు కొత్తిమీర చల్లుకుని తింటే టేస్టీగా ఉంటుంది. 

పాలిష్ చేసిన బియ్యంతో పోలిస్తే కొర్రలు ఎంతో ఆరోగ్యకరమైనవి. చిరుధాన్యాల్లో ఒకటైన ఇవి చిన్న పిల్లలకు, మధుమేహరోగులకు, గర్భిణులకు మంచి ఆహారం. వీటిలో సకల పోషకాలు ఉంటాయి. మాంసకృత్తులు, కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని నిత్యం తింటే బరువు కూడా తగ్గుతాయి. విటమిన్ బి1 వీటిలో అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు. కొన్ని రకాల క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడుతుంది. 

Also read: సిగరెట్ మానేయలేకపోతున్నారా? ఇవిగో ఈ చిట్కాలు పాటించి చూడండి

Also read: భారతీయ అమ్మాయిలకు బీర్ ఎందుకు నచ్చేస్తోంది? నిజంగానే అది అందాన్ని పెంచుతుందా?

Also read: షాకింగ్, కరోనా వ్యాక్సిన్ల వల్ల లుకేమియా వచ్చే అవకాశం? చెబుతున్న చైనా ఆరోగ్య సంస్థ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget