By: ABP Desam | Updated at : 08 Mar 2022 05:10 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
విదేశాల్లో బీర్ తాగడం చాలా సాధారణ విషయం. ఇప్పుడు ఇండియాలో కూడా ఇది సాధారణ విషయంగా మారిపోతోంది. కాలేజీ అమ్మాయిల నుంచి ఉద్యోగినుల వరకు అందరూ బీర్‌ను తాగే పానీయాల జాబితాలో కలిపేసుకున్నారు.అందులోనూ బీర్ తాగడం మంచి రంగు వస్తారని, అందం రెట్టింపవుతుందని కూడా యువతలో అపోహలు ఉన్నాయి. ఇవి ఎంతవరకు నిజం?
బీరు ఎందుకిష్టం?
గ్లోబల్ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో బీరు తాగుతున్నవారిలో మహిళలు 7.5 శాతం మంది. మరొక సంస్థ కమ్యూనిటీ ఎగెనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ నిర్వహించిన సర్వే ప్రకారం మద్యం సేవించే మహిళల సంఖ్య ఈ సంవత్సరం పెరిగింది. వచ్చే అయిదేళ్లలో ఈ సంఖ్య మరొక పాతిక శాతం పెరిగే అవకాశం ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశంలోని మెట్రో నగరాల్లోని మహిళలు బీర్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆఫీసు పార్టీలు, ఇంట్లో వేడుకలు, పుట్టినరోజు పార్టీలు అధికమైనప్పుడు బీరు సర్వ్ చేయడం సాధారణంగా మారింది. దీనికి కారణం ఇందులో ఆల్కహాల్ శాతం, కేలరీలు తక్కువగా ఉండడం, పిండిపదార్థాలు, కొవ్వు లేని పానీయం కావడంతో ఆడవారు అధికంగా దీనికి ఆకర్షితులవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అందుకే మద్యానికి దూరంగా ఉండేవాళ్లు కూడా బీర్ ను ఇష్టపడతారు.
బీర్‌కు మహిళకు మధ్య బంధం ఏనాటిదో...
నిజానికి బీరుకు, స్త్రీకి మధ్య బంధం ఇప్పటిది కాదు. మెసపోటేమియాలోని సుమేరియన్ దేవత కోసం 1800లలోనే బీర్‌తో వంటకాలు చేసేవారు. 5000 ఏళ్ల నుంచి బ్రూయింగ్ వ్యాపారానికి మహిళలకు మధ్య గట్టి బంధమే ఏర్పడింది. అప్పట్లో ఎక్కువగా బీర్ అమ్మేవారు అధికంగా ఆడవారేనట. మధ్యలో ఈ పానీయానికి మహిళలు దూరమయ్యారు. కానీ ఇది కేవలం మగవారి పానీయమేనని ఎక్కడా చెప్పలేదు.
బీర్‌తో అందం?
బీరు అధికంగా తాగడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి ఆడవారు చాలా పరిమితంగా మాత్రమే దీన్ని తీసుకోవాలి. చర్మానికి, జుట్టుకు బీర్ మేలు చేస్తుంది. కానీ అది చాలా పరిమితంగా తాగినప్పుడే. అలాగే బీర్ తో అప్పుడప్పుడు జుట్టు వాష్ చేసుకుంటే మెరుపు సంతరించుకుంటుంది. జట్టుకు షాంపూ రాసుకున్నాక కడిగేసుకుని తిరిగి బీర్ తో తడపాలి. సాధారణ నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా నెలకోసారి చేసినా చాలు. అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేసుకునేందుకు బీర్ ఉపయోగపడుతుంది. పురాతన ఈజిప్షియన్లు ఎడారి వేడిని తట్టుకునేందుకు బీర్ స్నానాలు చేసేవారు. రోజ్ వాటర్ లాగే బీర్ తో కూడా అప్పుడప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఆడవాళ్లకూ మెరుగైన జీతం - జీవితం కోసమే పుట్టుకొచ్చింది మహిళా దినోత్సవం, తొలి అడుగు పడింది ఆ దేశంలోనే
Also read: షాకింగ్, కరోనా వ్యాక్సిన్ల వల్ల లుకేమియా వచ్చే అవకాశం? చెబుతున్న చైనా ఆరోగ్య సంస్థ
Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం
Demetia: డిమెన్షియాను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?
ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!
Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!
వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం