News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ButterMilk: చలువ చేస్తుందని మజ్జిగ అతిగా తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రావచ్చు

మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం. కానీ అతిగా తాగితే మాత్రం అనారోగ్యాలు తప్పవు.

FOLLOW US: 
Share:

మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో రోగాలకు ఇది నివారణగా పనిచేస్తుందని చెబుతారు. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. మితంగా తింటేనే ఆరోగ్యం, అమితంగా తింటే మాత్రం ఏదో ఒక సైడ్ ఎఫెక్టులు వస్తాయి. అలాగే మజ్జిగ కూడా అతిగా తాగితే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. వీటిపై చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. ఇలాంటి సమస్యలు వచ్చినా అవి మజ్జిగ వల్ల అని అనుకోరు. కాబట్టి అతిగా మజ్జిగ తాగితే వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకోండి.

పాలతో చేసిన ఏ పదార్థాల్లో అయినా లాక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అందరికీ అరగదు. దీన్ని అరిగించుకునే శక్తి పేగుల్లో విడుదలయ్యే ఎంజైమ్‌ల పైన ఆధారపడి ఉంటుంది. కొందరికి ఈ లాక్టోజ్‌ను అరిగించే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు అధికంగా మజ్జిగ, పాల పదార్థాలు తినడం వల్ల కడుపునొప్పి, అజీర్తి, విరేచనాలు కలుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి మజ్జిగను అధికంగా తాగవద్దు. ఎవరిలో ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్య ఉంటుందో కనిపెట్టడం కష్టం. అలాగే కొందరికి పాలలో ఉండే ప్రోటీన్లు కూడా పడవు. పాలలో ఉండే ప్రోటీన్లే మజ్జిగలో కూడా ఉంటాయి. మజ్జిగ అధికంగా తాగడం వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు రావచ్చు. కాబట్టి రోజుకు ఒక గ్లాసుకి మించి తాగకపోవడం మంచిది.

మజ్జిగ తాగడం వల్ల మన శరీరానికి అందే క్యాలరీలు తక్కువే. అందుకే ఎక్కువమంది మజ్జిగను తాగేందుకు ఇష్టపడతారు. క్యాలరీలు లేవు కదా అని అధికంగా తాగితే మాత్రం జలుబు వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మజ్జిగ చలువ పదార్థం. కొంతమంది మజ్జిగలో చక్కెర వేసుకొని తాగుతూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభము ఉండదు. చక్కెర లేకుండా సాధారణ మజ్జిగను తాగడమే ఆరోగ్యకరం. అలాగే ఉప్పును కూడా అధికంగా వేసుకోకూడదు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటివి వేసి ఒక గంట సేపు వాటిని నానబెట్టి తర్వాత వడకట్టి ఆ మజ్జిగను తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఉప్పును వేసుకొని తాగడం వల్ల హై బీపీ వంటివి పెరుగుతాయి. కాని ఇతర ఉపయోగాలు ఏమీ ఉండవు. వేసవికాలంలో మజ్జిగను తాగితే ఆరోగ్యకరం. కానీ వానాకాలం, శీతాకాలంలో రోజూ మజ్జిగను గ్లాసుల కొద్ది తాగడం అలవాటు చేసుకోవద్దు. వేసవిలో రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ తాగవచ్చు. కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చిన్న గ్లాసు మజ్జిగతోనే ఆపేయాలి. లేకుంటే త్వరగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరే అవకాశం ఉంది.

Also read: అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా? జాగ్రత్త క్యాన్సర్ బారిన పడతారు

Also read: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 23 Sep 2023 11:09 AM (IST) Tags: Buttermilk Side Effects Buttermilk Buttermilk nausea Buttermilk Uses

ఇవి కూడా చూడండి

Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?

Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?

Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?

Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్