అన్వేషించండి

Pineapple Halwa: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో

పైనాపిల్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ దీన్ని ఎలా తయారు చేయాలో ఎంతోమందికి తెలియదు.

కొంతమంది హల్వా అని పిలిస్తే, మరి కొంతమంది కేసరి అంటారు. ఏదైనా సరే ఇది ఎంతో మందికి ఇష్టమైన వంటకం. దీన్ని రవ్వతోనే అధికంగా తయారు చేస్తారు. నిజానికి పైనాపిల్‌తో తయారు చేస్తే దీని రుచి అదిరిపోతుంది. ఎలా చేయాలో ఇక్కడ చెబుతున్నాం. ఒకసారి ప్రయత్నించండి. దీన్ని చేయడం చాలా సులువు. దేవతలకు నైవేద్యంగా కూడా దీన్ని నివేదించవచ్చు. కాబట్టి ఎప్పుడూ సాధారణ కేసరి పెట్టే కన్నా ఇలా పైనాపిల్ కేసరిని పెడితే అద్భుతంగా ఉంటుంది. దీని వాసన కూడా నోరూరించేలా ఉంటుంది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.

కావాల్సిన పదార్థాలు
పైనాపిల్ ముక్కలు - ఒకటిన్నర కప్పు 
కుంకుమపువ్వు - చిటికెడు 
పంచదార - నాలుగు స్పూన్లు
నెయ్యి - నాలుగు స్పూన్లు 
ఎండు ద్రాక్షలు - పావు కప్పు 
రవ్వ - ఒక కప్పు 
పైనాపిల్ ఎసెన్స్ - ఒక చుక్క 
జీడిపప్పు - గుప్పెడు 
పచ్చి యాలకులు - ఒకటి 
నీరు - అవసరమైనంత

తయారీ ఇలా
స్టవ్ మీద కళాయి పెట్టాలి. మంట మీడియంలో ఉండేటట్టు చూసుకోవాలి. గ్లాసుడు నీళ్లు పోసి పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ ఎసెన్స్, పంచదార, కుంకుమపువ్వు వేసి ఉడికించాలి. మీడియం మంట మీద ఉంచి పావుగంటసేపు ఉడికిస్తే చక్కెర పూర్తిగా కరిగిపోతుంది. ఉడికిన పైనాపిల్‌ను మెత్తగా అయ్యేలా బాగా కలపాలి. ఆ మిశ్రమం అంతా నీళ్లగా కాకుండా కాస్త ముద్దలా అయ్యే వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మరొక కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. దానిలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె వేడెక్కాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రవ్వ, యాలకుల పొడి వేసి వేయించాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి వేయించాలి. రవ్వ గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని ఈ రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మంటను తగ్గించి ఈ మొత్తం మిశ్రం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నీరంతా ఆవిరి అయిపోయి హల్వాలా తయారయ్యాక, పైన ఎండు ద్రాక్షను జల్లుకోవాలి. హల్వా రెడీ అయ్యాక కళాయి గోడలకు అంటుకోకుండా వచ్చేస్తుంది. అంటే ఇక స్టవ్ కట్టేయచ్చని అర్థం. ఇప్పుడు ఈ హల్వాను ఒక గిన్నెలోకి తీసి పైన పైనాపిల్ ముక్కలను గార్నిష్ చేసి సర్వ్ చేయండి. దీని రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి వారానికి ఒక్కసారైనా పైనాపిల్ హల్వాను ప్రయత్నించండి.

Also read: వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త

Also read: దానిమ్మ తొక్కలు పడేస్తున్నారా? వాటితో అందాన్ని ఇలా పెంచేయొచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Embed widget