అన్వేషించండి

Honey: తేనె నిజమైనదో కల్తీదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

స్వచ్చమైన తేనె అని చెప్పేసి పంచదార సిరప్ ని అమ్ముతుంటారు కొందరు. అందుకే మీరు కొన్న తేనె ఒరిజనల్ లేదా కల్తీదో ఇంట్లోనే సులభంగా చెక్ చేసి తెలుసుకోవచ్చు.

బంగారు అమృతంగా పిలవబడే తేనె అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తీసుకుంటారు. పంచదారకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది ఇళ్ళలో తేనె వినియోగిస్తారు. దీని రుచి మాత్రమే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. నేరుగా తేనె పట్టు నుంచి తీసిన తేనెకి దుకాణాల్లో అమ్మే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్వచ్చమైన తేనె తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రపంచవ్యాప్తంగా కల్తీ ఆహార ఉత్పత్తుల్లో తేనె కూడా ఒకటిగా నిలిచింది. పంచదార సిరప్ లో రంగు కలిపి తేనె అంటూ అమ్మేస్తున్నారు. మీరు కొనుగోలు చేసింది స్వచ్చమైన తేనె లేదంటే కల్తీదా అని తెలుసుకునేందుకు ఈ టిప్స్ పాటించి చూడండి.

టిష్యూ పేపర్ పరీక్ష

టిష్యూ పేపర్ తో తేనె స్వచ్చతని పరిశీలించవచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా? ఒక టిష్యూ తీసుకుని దాని మీద కొన్ని చుక్కల తేనె వేసి కాసేపు అలాగే ఉంచాలి. కొంత సేపటి తర్వాత తేనె పూర్తిగా అందులో ఇంకిపోతుంది. పేపర్ తేనెని గ్రహిస్తే అది కల్తీది అని అర్థం. కానీ అలా కాకుండా తేనె టిష్యూ మీద అలాగే ఉంటే మాత్రం అది స్వచ్చమైనదని అర్థం.

బ్రెడ్ పరీక్ష

ప్రతి ఇంట్లో బ్రెడ్ తప్పనిసరిగా ఉంటుంది. చాలా మంది బ్రెడ్ రోస్ట్ చేసుకుని దాని మీద తేనె వేసుకుని కూడా తీసుకుంటారు. ఈ బ్రెడ్ తో తేనె ఒరిజనలా నకిలీదా అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం బ్రెడ్ ముక్క తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె వేసి కాసేపు అలాగే ఉంచాలి. కొంత సమయం తర్వాత బ్రెడ్ మీద తేనె ఉందో లేదో చెక్ చేయండి. బ్రెడ్ తేనెని పీల్చుకుని తడిగా ఉంటే అది ఖచ్చితంగా కల్తీది. తేనె పీల్చుకోకుండా ఉంటే మీరు కొనుగోలు చేసిన తేనె నిజమైనది.

అగ్గిపుల్ల పరీక్ష

ఇది చాలా సులభమైన పరీక్ష. దీని కోసం కష్టపడాల్సిన పని కూడా లేదు. ఒక అగ్గిపెట్ట తీసుకుని తేనెలో నానబెట్టాలి. తర్వాత దాన్ని వెలిగించేందుకు ప్రయత్నించండి. అగ్గిపుల్ల కాలిపోతే తేనె కల్తీ కాదు. అదే అగ్గిపెట్టె వెలగడానికి కొంత సమయం తీసుకుంటే మాత్రం అందులో నీరు కలిసిందని అది కల్తీ అని తేలిపోతుంది.

తేనె ప్రయోజనాలు

పరగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. మరికొందరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం రోజు ఒక స్పూను తేనెను ఆరగిస్తారు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. శరీరంలోని మంటని తగ్గిస్తాయి. జలుబు, ఫ్లూ నివారణగా అద్భుతంగా పని చేస్తుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనే కలుపుకుని తాగితే హాయిగా నిద్రపడుతుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. తేనె దంత సమస్యల్ని అడ్డుకుంటుంది. నోరు చెడు వాసన రాకుండా అడ్డుకుంటుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

టాప్ హెడ్ లైన్స్

Sperm Quality And Stress : యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
Eating Habits for Kids : పిల్లలకు హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయడం ఎలా? తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాలు ఇవే
పిల్లలకు హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయడం ఎలా? తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాలు ఇవే
H1N1 Flu Risk in Offices : ఆఫీసులో పెరుగుతోన్న H1N1 ఫ్లూ ముప్పు.. ఈ చిన్న తప్పులే వైరస్ వ్యాప్తికి కారణమట, జాగ్రత్త
ఆఫీసులో పెరుగుతోన్న H1N1 ఫ్లూ ముప్పు.. ఈ చిన్న తప్పులే వైరస్ వ్యాప్తికి కారణమట, జాగ్రత్త
Sleep Poorly in New Places : 'First Night Effect' అంటే ఏమిటి? కొత్త ప్రదేశాలలో నిద్రపోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసా?
'First Night Effect' అంటే ఏమిటి? కొత్త ప్రదేశాలలో నిద్రపోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసా?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
Kishan Redd vs Revanth Reddy : మోదీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీ కలవడానికి వెళ్లాలనుకున్నారా? లేదా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి!
మోదీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీ కలవడానికి వెళ్లాలనుకున్నారా? లేదా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి!
Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
Toxic Movie Review - 'టాక్సిక్' రివ్యూ: రెండు క్యారెక్టర్లు, మూడు లుక్కులు... యష్ ఎలా చేశాడు? సినిమా హిట్టా? ఫట్టా?
'టాక్సిక్' రివ్యూ: రెండు క్యారెక్టర్లు, మూడు లుక్కులు... యష్ ఎలా చేశాడు? సినిమా హిట్టా? ఫట్టా?
Action Thriller OTT : ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
Ramthulla Shaik Success Story: రోజువారీ కూలీ నుంచి NUS పీహెచ్‌డీ వరకు: రహ్మతుల్లా షేక్ స్ఫూర్తి కథ
నెల్లూరు జిల్లాకు చెందిన రోజువారీ కూలీకి 15 లక్షల ప్యాకేజ్‌తో జాబ్‌ ఆఫర్‌! సింగపూర్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం! 
Embed widget