(Source: Poll of Polls)
Instagram Reels ద్వారా డబ్బు సంపాదించవచ్చా? రీల్‌కి 10K వ్యూస్ వస్తే ఎంత వస్తుంది?
Instagram Reels :ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదించాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో.. పదివేల వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

Instagram Reels for Moeny : డిజిటల్ యుగంలో ఆన్లైన్లో వివిధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు. అలాంటి వాటిలో Instagram కూడా ఒకటి. దీనిలో కేవలం ఫోటోలు, వీడియోలను షేర్ చేసే వేదిక మాత్రమే కాదు.. లక్షలాది మందికి ఆదాయ వనరుగా కూడా ఇన్‌స్టా మారింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వచ్చిన తర్వాత.. క్రియేటర్లకు పేరుతో పాటు డబ్బు వచ్చే అవకాశాన్ని రెట్టింపు చేసింది. దీనిలో మీరు కూాడా డబ్బులు సంపాదించాలని.. కొత్త క్రియేటర్‌గా మారాలనుకుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌పై 10 వేల వ్యూస్ వస్తే డబ్బు వస్తుందా? రాదా? వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు సంపాదన ఎప్పుడు ప్రారంభమవుతుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
10 వేల వ్యూస్ వస్తే డబ్బు వస్తుందా?
ఇన్‌స్టాలో మీరు ఓ రీల్ పోస్ట్ చేసినప్పుడు.. దానికి పదివేల వ్యూస్ వస్తే సంతోషంగానే ఉంటుంది. అయితే దీనిపై సంపాదన వస్తుందా? అంటే రాదు. ఎందుకంటే.. రీల్ 10వేల వ్యూస్ తెచ్చుకున్నా ఎటువంటి సంపాదన ఉండదు. మీ ఇన్‌స్టా అకౌంట్ మానిటైజేషన్ ప్రమాణాలను ఫాలో అవ్వకపోతే.. Instagram వ్యూస్‌ల ఆధారంగా నేరుగా డబ్బును ఇవ్వదు. Instagramలో డబ్బు సంపాదించాలంటే కేవలం వ్యూస్‌లు మాత్రమే కాదు.. దానిలో ఎంగేజ్‌మెంట్ అంటే లైక్‌లు, కామెంట్లు, షేర్‌లు వీటితో పాటు ఫాలోవర్లు, కంటెంట్ నాణ్యత కూడా ముఖ్యం.
వ్యూస్ అంటే ఏమిటి?
10 వేల వ్యూస్ అంటే మీ రీల్‌ను ఆడియన్స్ 10 వేల సార్లు చూశారని అర్థం. దీనితో Instagram దృష్టిలో మీరు యాక్టివ్ క్రియేటర్ లాగా కనిపిస్తారు. మీరు నిరంతరం రీల్స్ చేస్తూ ఉంటే, వ్యూస్ పెరుగుతూ ఉంటే.. మీ కోసం మానిటైజేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.
ఇన్‌స్టాలో సంపాదన ఎప్పుడు మొదలవుతుందంటే
మీ ఫాలోవర్ల సంఖ్య బాగుంటే ఇన్‌స్టాలో సంపాదన మొదలవుతుంది. సాధారణంగా 10,000 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నప్పుడు.. బ్రాండ్‌లు మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తాయి. పైగా మీ ఖాతా నిరంతరం ఎంగేజ్‌మెంట్ ఎక్కువగా ఉంటూ.. మీ రీల్స్‌పై వ్యూయర్స్ స్పందించి.. షేర్ చేస్తుంటే మీకు వివిధ రూపాల్లో బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి. అలా మీరు సంపాదన మొదలు పెట్టొచ్చు.
ఇన్‌స్టాలో బోనస్ ప్రోగ్రామ్, రీల్స్ ప్లే ప్రోగ్రామ్
ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం కొన్ని దేశాల్లోని క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో రీల్స్‌పై వచ్చే వ్యూస్‌ల ఆధారంగా బోనస్ లభిస్తుంది. ఇందులో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే దీని కోసం లక్షల వ్యూస్‌లు ఉండడంతో పాటు యాక్టివ్ ఫాలోవర్లు కూడా అవసరం.
బ్రాండ్ ప్రమోషన్, స్పాన్సర్‌షిప్‌లు
ఇన్‌స్టాలో అసలు సంపాదన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మీ కంటెంట్ ఇతరుల కంటే ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటే.. కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మీకు డబ్బు ఇస్తాయి. ఇక్కడ ఒక రీల్‌కు రూ. 500 నుంచి రూ. 50,000 వరకు డీల్స్ ఉండవచ్చు.
అయితే మీ కంటెంట్‌తో యూజర్స్‌ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉంటే.. మీరు చాలా త్వరగా ఇన్‌స్టా ద్వారా డబులు సంపాదించగలుగుతారు. కాబట్టి మీరు చేసే కంటెంట్ యూనిక్‌గా, ఎంగేజింగ్‌గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.






















