Schedule Instagram Messages : ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేసి పంపొచ్చు తెలుసా? ఇలా షెడ్యూల్ చేసేయండి
Instagram Message Scheduling : ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ వాడని వారు ఉండడం చాలా తక్కువ. అయితే ఈ ఇన్‌స్టాలో మెసేజ్‌లను షెడ్యూల్ చేసి పంపొచ్చని మీకు తెలుసా? తెలియకుంటే ఇది చూసేయండి.

Schedule Instagram Messages Step by Step : ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఈ రోజుల్లో చాలామందికి అడిక్షన్‌లా మారింది. అయితే రీల్స్ చూస్తూ.. ఇన్‌స్టాలో గంటల కొద్ది టైమ్ స్పెండ్ చేసినా.. కొన్ని సెట్టింగ్స్ గురించి అందరికీ తెలీదు. అలా తెలియని వాటిలో మెసేజ్ షెడ్యూలింగ్ కూడా ఒకటి. అవును ఇన్‌స్టాలో కూడా మెసేజ్‌లను షెడ్యూల్ చేసి పంపవచ్చు. ఇన్‌స్టాను బిజినెస్ పర్పస్ ఉపయోగించేవారికి, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి బాగా హెల్ప్ అవుతుంది. దీనిని ప్రతి యూజర్ వినియోగించుకోవచ్చు.
బిజినెస్‌ని డెవలెప్ చేసుకోవడానికి.. సమాచారాన్ని షేర్ చేయడానికి.. గ్రీటింగ్స్ చెప్పడానికి, రిమైండర్స్, అప్డేట్స్ను పంపేందుకు.. ఆ సమయంలో మీరు అందుబాటులో లేకున్నా.. అవతలి వ్యక్తి మెసేజ్ సకాలంలో డెలివరీ అయ్యేలా షెడ్యూల్ చేయొచ్చు. షెడ్యూల్ డైరక్ట్ మెసేజెస్ ఫీచర్ ద్వారా మెసేజ్‌ని కంపోజ్ చేసి.. ఏ టైమ్‌కి పంపాలో సెట్ చేస్తే.. చాలు. మీరు ఆ సమయంలో ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం కూడా లేకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూసేద్దాం.
ఇలా షెడ్యూల్ చేయండి..
- ముందుగా మీ మొబైల్లో Instagram ఓపెన్ చేసి, లాగిన్ అవ్వాలి.
- మెసేజ్ ఇన్‌బాక్స్ కోసం.. హోమ్ ఫీడ్‌లో కుడివైపు పై భాగంలో ఉన్న పేపర్ ఎయిర్‌ప్లేన్ సింబల్ నొక్కాలి.
- ఇన్పుట్ బాక్స్‌లో మీరు ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వారి పేరు టైప్ చేసి.. మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయాలి.
- మీరు పంపాలనుకున్న మెసేజ్ పూర్తిగా టైప్ చేసిన తర్వాత.. సెండ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయండి.
- అక్కడ మీకు షెడ్యూలింగ్ మెనూ కనిపిస్తుంది.
- మీరు అక్కడ ఏ రోజు.. ఏ సమయంలో ఆ మెసేజ్ పంపాలనుకుంటున్నారో.. డిటైల్స్ ఇవ్వాలి.
- అనంతరం దానిని కన్ఫామ్ చేయాలి. ఇలా షెడ్యూల్ చేసిన తర్వాత.. scheduled message అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది.
- అంతే మీ మెసేజ్ షెడ్యూల్ అయిపోయినట్లే. ఇలా మీరు మీ ఫ్రెండ్స్ స్పెషల్ ఈవెంట్స్‌కు విష్ చేయడానికి, బిజినెస్ ప్రమోషన్స్ కోసం మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు.
Also Read : వాట్సాప్‌లో త్వరలో న్యూ అప్డేట్.. ఇకపై స్టేటస్‌ను నేరుగా ఫేస్బుక్, ఇన్‌స్టాలో షేర్ చేసుకోవచ్చట
షెడ్యూల్ చేసిన మెసేజ్ డిలేట్ చేయాలంటే..
కొన్నిసార్లు అవతలివారికి మెసేజ్ పంపాలనుకుని.. తర్వాత వద్దులే అని రియలైజ్ అవుతాము. అలా షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను డిలేట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే..
- మీరు షెడ్యూల్ చేసిన వ్యక్తి చాట్‌కు వెళ్లండి.
- అక్కడ షెడ్యూల్ మెసేజ్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి. అక్కడ మీరు తొలిగించాలనుకున్న మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి.
- అప్పుడు మీరు మెసేజ్‌ను డిలేట్ చేయవచ్చు. అలాగే షెడ్యూల్ టైమ్‌కి కూడా అది వెళ్లదు.
ఈ షెడ్యూల్ మెసేజ్ ద్వారా ఫోటోలు, వీడియోలు పంపడం కుదరదు. కేవలం టెక్ట్స్ మెసేజ్ మాత్రమే వెళ్తుందని గుర్తించుకోవాలి. ఇతర ఏ ఫైల్స్ పంపాలన్నా మ్యానువల్‌గానే పంపాల్సి ఉంటుంది.
Also Read : న్యూ ఫీచర్స్‌తో యూట్యూబ్.. ఈ మార్పులు, చేర్పుల గురించి తెలుసా? కేవలం వారికి మాత్రమేనా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

