అన్వేషించండి

Romantic Thoughts: మీలో లేదా మీ పార్టనర్‌లో ఈ లక్షణాలున్నాయా? వీరు చాలా చాలా రొమాంటిక్!

రొమాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, చాలామందిలో తాము రొమాంటిక్‌గా ఉంటామా లేదా అనే సందేహం ఉంటుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే తప్పకుండా మీరు రొమాంటిక్ పర్శనే.

Romantic Partner | కొన్ని జంటలను చూస్తుంటే.. ‘‘అబ్బా, భలే రొమాంటిక్‌గా ఉన్నారే’’ అని అనిపిస్తుంది. అదే సమయంలో.. మీ మీద మీకే సందేహం కూడా వస్తుంది. మనం వారంత రొమాంటికా కాదా? అనే సందేహం కలుగుతుంది. దీని గురించి మీ పార్టనర్‌ అభిప్రాయం తెలుసుకోడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ, వారి నుంచి అంత పాజిటివ్‌గా ఆన్సర్ రాకపోవచ్చు. అయితే, మీలో ఆ రొమాంటిక్ పర్శన్ ఉన్నాడో లేదో తెలుసుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. మీ లక్షణాల ద్వారా మీరేంటో తెలుసుకోవచ్చు. అవేంటో చూసేయండి మరి. 

కొందరిని మాటల ద్వారా.. మరికొందరిని చేతల ద్వారా రొమాంటిక్ అని కనిపెట్టేయొచ్చు. కానీ, చాలామంది తమలోని రొమాంటిక్ యాంగిల్‌ను కనిపించకుండా జాగ్రత్తపడ్డతారు. అవసరమైనప్పుడే బయటపడుతుంటారు. అందుకే, పార్టనర్స్ సైతం తమ భాగస్వామి ఎంత రొమాంటిక్ అనే విషయాన్ని అంచనా వేయలేరు. రొమాంటిక్ అంటే కేవలం కామవాంఛ కాదు. అది ప్రేమను వ్యక్తం చేయడం లేదా, పంచడం. అది ఐదు, పది నిమిషాల్లో ముగిసిపోయే అనుభవం కాదు. ఒకరిపై ఒకరికి విశ్వాసం, నమ్మకం, ఆప్యాయతను పెంచే లక్షణం. మీలో లేదా, మీ పార్టనర్‌లో ఈ లక్షణాలు ఉంటే మీరు చాలా లక్కీ.

❤ పట్టపగలే మీ డీమ్ పార్టనర్ గురించి కలలుగంటున్నారా? అయితే, మీరు చాలా రొమాంటిక్. 
❤ మీ పార్టనర్‌తో కలిసి అడుగులేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పాలని అనుకుంటున్నారా? నో డౌట్, మీరు చాలా రొమాంటిక్. 
❤ ఏ కారణం లేకుండా మీలో మీరే నవ్వేసుకుంటున్నారా? అది నవ్వు కాదు, ఒక రొమాంటిక్ ఫీలింగ్. 
❤ ఆమె లేదా అతడి కోసం మీరు లేఖలు, కవితలు రాసేస్తున్నారా? Wow, how romantic you are!!
❤ మీకు నచ్చిన వ్యక్తి కళ్ల ముందు నిలుచోగానే మాట తడబడుతుందా? అది మౌనం కాదు, ఫీలింగ్. 
❤ ఆమె/అతడి కోసం మీకు పాట పాడాలి అనిపిస్తుందా? అయితే, అది మీ మనసు నుంచి వచ్చే రొమాంటిక్ భావన.
❤ నచ్చిన వ్యక్తితో కలిసి లంచ్ లేదా డిన్నర్ తినాలనిపించడం కూడా చాలా రోమాంటిక్ ఆలోచన.
❤ మీకు నచ్చిన వ్యక్తితో గడిపిన రోజు చాలా అందంగా అనిపించడం, కళ్లలోనే కదులుతుండటం ఒక గొప్ప రొమాంటిక్ అనుభూతి. 
❤ మీరు ఇష్టపడే వ్యక్తిలోని లోపాలను కూడా మీరు ఇష్టపడుతుంటే.. అది కచ్చితంగా రొమాంటిక్ ఫీలింగే.
❤ మీ పార్టనర్ కష్టాన్ని మీ కష్టంగా భావించడం, వారి కోసం త్యాగానికి కూడా సిద్ధం కావడం కూడా మంచి ఫీలింగ్. అది మీ బంధాన్ని బలపరుస్తుంది.
❤ రొమాంటిక్ ఆలోచనలకు మీ పార్టనర్ అందం, రూపంతో ఎలాంటి సంబంధం ఉండదు. అది స్వచ్ఛమైన ప్రేమను తెలియజేస్తుంది.
❤ మీ పార్టనర్ భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకోవడం, వారి ఇష్టాలను తెలుసుకుని సర్‌ప్రైజ్ చేయాలనే ఆలోచనలు రావడం కూడా రొమాంటిక్ లక్షణమే.
❤ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడటం, చూసే కొద్ది అలా చూస్తుండిపోవాలనే ఆలోచన రావడం కూడా రొమాంటిక్కే!
❤ మీ పార్టనర్‌ నవ్వుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు నవ్వేస్తున్నారా? అయితే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
❤ మీకు నచ్చిన వ్యక్తికి మీ మనసులో మాటలన్నీ చెప్పేసి, మనసు తేలిక చేసుకోవడం కూడా గొప్ప అనుభూతే. 
❤ పని వేళల్లో భాగస్వామిని బాగా మిస్ కావచ్చు. కానీ, వీకెండ్ లేదా సెలవు రోజుల్లో ఎక్కువ సేపు పార్టనర్‌కు కేటాయించాలనే ఆలోచన కలగడం.
❤ ‘నువ్వు’, ‘నీది’ అని విడదీసి మాట్లాడకుండా ‘మనం’, ‘మన’ అని కలిపి మాట్లాడటం. బంధాన్ని బలోపేతం చేసి ‘రొమాంటిక్’ ఫీల్ కలిగిస్తుంది.

Also Read: ఇదో ‘కంపు’ పాము, ఇది చేసే పనేంటో తెలిస్తే నవ్వు ఆగదు

పెళ్లికి ముందు, ఆ తర్వాత: కానీ, ఈ ఫీలింగ్ పెళ్లికి ముందు ఆ తర్వాత వేర్వేరుగా ఉంటుందని చాలామంది అంటారు. అయితే, పెళ్లి తర్వాత కొన్ని భావాలను చాలామంది మనసులోనే పెట్టేసుకుంటారు. ప్రేమించే సమయంలో తమ లవర్.. జీవిత భాగస్వామి కావాలనే లక్ష్యంతో చాలామంది రొమాంటిక్ ఫీలింగ్స్‌ను బయటకు ప్రదర్శిస్తుంటారు. పెళ్లి తర్వాత ఆ ప్రదర్శన క్రమేనా తగ్గుతుంది. వాటిని బయట పెట్టకుండా మనసులోనే ఉంచేసుకుంటారు. లైంగిక ఆలోచనలు కలిగినప్పుడు మాత్రమే ‘రొమాన్స్’ అస్త్రాన్ని బయటకు తీస్తారు. కానీ, పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా రొమాంటిక్ ఫీలింగ్స్‌ను అలాగే కొనసాగిస్తే.. లైఫ్ మరింత బ్యూటీ‌ఫుల్‌గా ఉంటుంది. మీ పార్టనర్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. కాబట్టి, పైన చెప్పినవి కేవలం లక్షణాలుగానే కాదు, జీవితాన్ని అందంగా మార్చుకోడానికి అవసరమైన చిట్కాలుగా కూడా స్వీకరించవచ్చు. 

Also Read: ఇండియాలో.. వేసవిలో కూడా మంచు కొరిసే ప్రాంతం ఇదే

 

టాప్ హెడ్ లైన్స్

Dry Skin in Winter : చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget