Farting Snake: ఇదో ‘కంపు’ పాము, ఇది చేసే పనేంటో తెలిస్తే నవ్వు ఆగదు
ఈ పాము వదిలే ఆ వాయువుకు శతృవులు కన్‌ఫ్యూజ్ అవుతాయి. ఇంతకీ అది ఏ వాయువు?
Farting Snake | పాములను చూస్తే వణుకు వస్తుంది. కానీ, ఈ పామును చూస్తే వణుకు మాత్రమే కాదు.. బోనస్‌గా కంపు కూడా వస్తుంది. పెద్ద పెద్ద జంతువులు కూడా ఆ కంపు భరించలేక కన్ఫ్యూజ్ అవుతాయి. ఇంతకీ ఆ కంపు ఏమిటీ? అది పాము నుంచి ఎందుకు వస్తుందనేగా? మీ సందేహం. అయితే, చూడండి.
ఈ లోకంలో బతకాలంటే శత్రువులను ఎదుర్కోవాలి. అయితే, అది అన్ని జీవుల వల్ల సాధ్యం కాదు. పులి, సింహాలు వంటివి తమ బలంతో తమని తాము రక్షించుకోగలవు. బలహీన జీవులు ప్రకృతిలో మమేకమై రంగులు మార్చుకుంటూ శత్రువుల నుంచి తప్పించుకుంటాయి. పాములు పడగవిప్పి శత్రువులను భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. కొండ చిలువ తరహా పాములైతే నలిపి నలిపి చంపేస్తాయి. అయితే, ఈ పాముకు అంత శక్తి లేదు. దీంతో అది శత్రువులను కన్ఫ్యూజ్ చేయడం కోసం అపానవాయువు(పిత్తులు)ను అస్త్రంగా చేసుకుంటుంది. ఛీ, పిత్తులా అని నవ్వేసుకోకండి. మీరు చదివింది నిజమే.
అమెరికా, మెక్సికోలో ఎక్కువగా కనిపించే ఈ చిన్న పామును ఎవరైనా సమీపిస్తే చాలు వెంటనే పిత్తేసి చెడు వాసన వదులుతుంది. దీనివల్ల శతృవులు గందరగోళానికి గురవ్వుతాయి. అవి తేరుకొనేలోపే ఈ పాము పొదల్లోకి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటుంది. అది తన ప్రాణాలను రక్షించుకొనేందుకు వెనుక భాగం నుంచి గాలి బుడగలు వదులుతుంది. అవి పేలడం వల్ల గాల్లో అదోరకమైన వాసన ఏర్పడుతుంది. ఈ పాము ముక్కు కొక్కెంలా ఉండటం వల్ల వెస్ట్రన్ హూక్ నోస్డ్ స్నేక్ అని పిలుస్తారు. పిత్తుల వల్ల దీనికి ‘ఫార్టింగ్ స్నేక్’ అనే పేరు కూడా వచ్చింది.
Also Read: ఇండియాలో.. వేసవిలో కూడా మంచు కొరిసే ప్రాంతం ఇదే
ఈ చిన్న పాములు ఉత్పత్తి చేసే పిత్తుల శబ్దం 6'6 అడుగుల వరకు ప్రయాణించగలదు. ఇది సెకనులో పదవ వంతు మాత్రమే ఉంటుంది. మానుషులు వదిలే అపానవాయువుకు ఇది భిన్నంగా ఉంటుంది. అధిక పిచ్‌లో శబ్దం రావడం వల్ల ఇతర జంతువులకు చాలా గందరగోళంగా అనిపిస్తుంది. పెన్సిల్వీయాకు చెందిన బ్రూస్ యంగ్ అనే మార్ఫాలజిస్ట్ ఈ పాముపై ల్యాబ్‌లో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ఈ పాములో మరో ప్రత్యేకతను కూడా తెలుసుకున్నాడు. ఇది గట్టిగా పిత్తడం ద్వారా గాల్లోకి కూడా ఎగరగలదని తెలిపాడు. పిత్తే సమయంలో అది చాలా బలంగా వాయువును విడుదల చేస్తుందని, దాని వల్ల అది ఒక్కసారే గాల్లోకి ఎగురుతుందన్నాడు.