❄ వేసవి సెలవుల్లో ఏదైనా చల్లని ప్రాంతానికి చెక్కేయాలని ఉందా? అయితే, ఇది మీ కోసమే. ❄ ఇండియాలో వేసవిలో కూడా చల్లగా ఉండే అందమైన ప్రాంతం ఒకటి ఉంది. అదే ‘రొహతంగ్ పాస్’. ❄ రొహతంగ్ పాస్ 365 రోజులు మంచుతో కప్పబడి ఉంటుంది. సముద్ర మట్టానికి 13,054 అడుగుల ఎత్తులో ఇది ఉంది. ❄ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి 53 కిమీల దూరంలో రొహతంగ్ పాస్ ఉంది. ❄ ఈ మార్గం కేవలం వేసవిలో మాత్రమే పర్యటకుల కోసం తెరిచి ఉంటుంది. ❄ మౌంటెన్ బైకింగ్, పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ❄ మంచు మాత్రమే కాదు ఇక్కడి ప్రకృతి అందాలు కూడా మైమరపిస్తాయి. ❄ మే నెలాఖరు లేదా జూన్ నెలలో వెళ్లడం మంచిది. మంచు తీవ్రత ఎక్కువగా ఉంటే అనుమతి ఉండదు. ❄ రొహతంగ్ పాస్‌లో వసతి సదుపాయాలు ఉండవు. కులు లేదా మనాలిలో స్టే చేయాలి. ❄ రొహతంగ్‌కు వెళ్లేందుకు రవాణా సదుపాయాలుంటాయి. ❄ ఎలా చేరాలి?: ముందుగా రైలు లేదా విమానంలో ఢిల్లీ లేదా చండీగడ్ చేరుకోవాలి. ❄ చండీగడ్, ఢిల్లీ నుంచి కులు-మనాలి వెళ్లి, అక్కడి నుంచి ఉదయాన్నే రొహతంగ్ పాస్‌కు వెళ్లాలి. ❄ రొహతంగ్ పాస్ మార్గం మూసివున్నా.. తెరిచే ఉందని ట్రావెల్స్ సంస్థలు మోసం చేసే అవకాశాలున్నాయి. ❄ ❄ Images Videos Credit: Pixels and Pixabay ❄ ❄